Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐ ఎస్బి జిల్లా నాయకులు రోహిత్, పెండ్యాల సతీష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ ఏఐఎస్బి కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు రోహిత్, పెండ్యాల సతీష్ మాట్లాడుతూ వారం రోజులుగా వరం గల్ మండల పరిధిలో ప్రభుత్వ సంక్షేమ గురు కులాల్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వే కార్యక్రమంలో భాగంగా అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చా య న్నారు. అందులో ప్రధానంగా అనేక ప్రభుత్వ హాస ళ్లకు సొంత భవనాలు లేక అద్దె భవనాలల్లో, ఇరుకు గదులలో విద్యార్థులు అవస్థలు పడుతూ విద్య ను అభ్యసిస్తున్నారని విమర్శించారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తుందని తక్షణమే పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జ్‌లను పెంచాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో హరీష్ శంకర్, వరుణ్ అభిషేక్, శ్రవణ్ పాల్గొన్నారు.