Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జడ్పీ వైస్ చైర్పర్సన్ నాగజ్యోతి
నవతెలంగాణ-తాడ్వాయి
ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగు చేస్తూ అటవీ హక్కు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేత రుల కు న్యాయం కల్పించడంతో పాటు అడవులల సంరక్షణ, పునర్జీవనానికి శాశ్వత ప్రాతిపదికన పరిష్కా రం కొరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన మండల సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెవెన్యూ, పంచాయత్ రాజ్, అటవీశాఖలు సమన్వయం చేసుకుంటూ ఏంపీడీఓ గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని 2005 కంటే ముందు నుండి అన్యాక్రాంతంగా పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులను, మూడు తరాలు నుండి పోడు భూములను సాగుచేస్తున్న గిరిజనేతరులకు సంబంధిం చిన క్లెయిమ్ లను గ్రామ స్థాయి కమిటీలో క్లెయిమ్దారు సమక్షంలో క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలన్నారు. ఆయా స్థాయి కమిటీలో తీర్మానాలను, రిజిస్టర్లను పక్కాగా నమోదు చేయాలన్నారు. అటవీ భూములలో పోడు వ్యవసాయం ఎప్పటి నుండి జరుగుతుందన్న విష యాన్ని శాస్త్రీయంగా నిర్థారించేందుకు శాటిలైట్, మ్యాపుల ప్రకారం సాంకేతికతతో జీపీఎస్ సిస్టం ద్వారా డిజిటల్ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి పక్కాగా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. అటవీ రక్షణ చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.
అధికారులుగా త్వరగా పోడు భూ ములను సర్వే చేసి గిరిజన, గిరిజనేతరులకు న్యాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గొంది వాణి శ్రీ, స్థానిక తాసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, అటవీ శాఖ అధికారులు కోట సత్తయ్య, షౌకత్ అలీ, గౌతమ్ రెడ్డి, శిరీష, లింగాల ఇన్చార్జి శ్రీనివాస్, ఫారెస్ట్ రైట్ కమిటీ (ఎఫ్ ఆర్ సి) అధ్యక్షులు పోగు నాగేష్, సతీష్ మల్లేష్, మండల వివిధ గ్రామపంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, రేంజ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.