Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఎస్సీ సామాజికవర్గంలో ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఎమ్మెల్యేల ఇంటి బంధు పథకంగా మారిందని ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి కేదాసి మోహన్ ఆరోపించారు. శనివారం నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేల జోక్యం తొలగించాలని రూపొందించిన కరపత్రాన్ని మోహన్ ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకు ఈపథకం ద్వారా న్యాయం జరగాలంటే ప్రజా ప్రతినిధుల జోక్యం చేసుకో వద్దన్నారు. దళిత బంధు కోసం దరఖాస్తు చేసుకున్న దళితులు తమ ఆత్మ గౌరవాన్ని ఎమ్మెల్యే ముందు తాకట్టు పెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ (టీఎస్) జిల్లా అధ్యక్షుడు నామిండ్ల చిన్నస్వామి, జిల్లా అధికార ప్రతినిధి కొమ్ముల బిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షుడు చింత జోసెఫ్, జిల్లా నాయకులు ఎర్రల సుదర్శన్, మాదిగ యువసేన జిల్లా అధ్యక్షుడు సౌరం రాజు, నాయకులు వేల్పుల దయాకర్, సౌరం అభిలాష్, తదితరులు పాల్గొన్నారు.