Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
అణగారిన వర్గాలకు అండగా సత్యశోధకు సమాజ్ పని చేసిందని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న అన్నారు. శనివారం మహబూబాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపూలే స్థాపించిన 149వ సత్య బిశోదక్బి సమాజ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న ప్రసంగిస్తూ జ్యోతిరావు బాపూలే ఏర్పర్చిన సత్యశోధకు సమాజ్ ఏర్పాటు శూద్రులకు అతిశూద్రులకు సమాజంలో గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. సత్యశోధకు సమాజ్ అనేక శాఖలుగా విస్తరించి అంటరాని వారిని అణగారిన వర్గాలను మహిళలను చేరదీసి చైతన్యాన్ని అందించిందన్నారు. ఆర్ఎస్ఎస్ బిజెపి సంగుపరివారుల ఆధ్వర్యంలో నడుస్తున్న మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కులాల వారిగా విభజించే బ్రాహ్మణీయ సిద్ధాంతాన్ని సుస్థిరం చేసేందుకు సరికొత్త ప్రయత్నాలను తీవ్రం చేసింది. సెప్టెంబరు 24 నుండి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగు సభలు, సహా పంక్తి భోజనాలు, కులాంతర వివాహాల ఆవశ్యకతపై ప్రచారం తదితర కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ హలావతు లింగ్య, సబ్ డివిజన్, కార్యదర్శి కామ్రేడ్ ఎస్కే బాబు, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ సామ పాపన్న, జబ్బర్, పర్వత కోటేష్ తెలబోయిన కష్ణ, కొలిపాక ఐలయ్య, జయలచ్చమ్మ సామ రజిత, కవిత, మునిత కల్పన, యాకాంబరం తదితరులు పాల్గొన్నారు.