Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్
నవతెలంగాణ-కాశిబుగ్గ
హనుమకొండ జిల్లాలోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ దినసరి ఉద్యోగుల కార్మికులను టైమ్ స్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ పరిధిలోని యూనివర్సిటీలో సురేష్ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రమేష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్కరిని కూడా క్రమబద్ధీకరించలేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రస్తు తం పని చేస్తున్న కాటన్ పల్సెస్ రైస్ హాస్టల్ అవుట్సోర్సింగ్ కార్మికులకి పని భద్రత కల్పించి వేతనాలు పెంచాలని కార్మిక చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని లేని పక్షంలో రాబోవు కాలంలో పోరాటాలను ఉదతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
నూతన కమిటీ ఎన్నిక
సమావేశానంతరం సిఐటియు నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాగుల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.రాజ్ భరత్, ప్రధాన కార్యదర్శి శ్రీపతి సురేష్, ఉపాధ్యక్షులు నామసాని రమ, యం.పద్మ, లక్ష్మి, సహాయ కార్యదర్శులు లింగయ్య, సాయబోయిన రఘు, మంజుల, లలిత, పరికరాల యాదగిరి, కోశాధికారిగా సునీత, కార్యవర్గ సభ్యులుగా కుమార్, అశోక్, సరిత, రేణుకలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.