Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్
నవతెలంగాణ-ములుగు
ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనకు అధికారులు సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని నీతి ఆయోగ్ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆకాంక్ష జి ల్లాల లక్ష్యాల పై ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ అదిత్య, భవేష్ మిశ్రా, ఐటిడిఎ పిఓ అంకిత్లతో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహిం చారు. సంజరు కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వెనుకబడిన జిల్లాలను గుర్తించి వాటి అభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆకాంక్ష జిల్లాల ప్రాజెక్టు రూపొందించిందని తెలిపారు. 2018 లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సైతం ప్రభుత్వం ఆకాంక్ష జిల్లాగా ఎంపిక చేసిందని, 2019 ములుగు జిల్లాను ఇందులో భాగంగా జిల్లాలో వైద్యం, న్యుట్రిషన్, విద్య ,వ్యవ సాయం నీటి వనరులు, ఆర్థిక నైపుణ్య అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన రంగాలలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఆకాంక్ష జిల్లాలో జరిగే పనుల వివరా లు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, సకాలంలో వెబ్ సైట్లో నమోదు కాక పోవడం వల్ల మన జిల్లా ర్యాంకు 29 కు చేరిందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మంజూరు చేసిన రూ.10 కోట్లతో చేపట్టిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు. ప్రతి అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నా మని ఆయన వివరిం చారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లల పౌష్టికాహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు రూ.10.51 కోట్ల నిధులు, వైద్యం కోసం రూ.8.74 కోట్ల నిధులు కేటాయించామని, వీటితో పట్టిన పనులు వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులకు అవ సరమైన శిక్షణ అందించామని అన్నారు.జిల్లాలో ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెండు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేశామని, సబ్ హెల్త్ సెంటర్లను వెల్ నెస్ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేశా మన్నారు. కలెక్టర్ సంబంధిత శాఖల అధికారుల సమ న్వయంతో అభివృద్ధి వేగంగా నడిపించాలని, జిల్లా అభివద్ధిలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం చేయాలని ఉన్న నిధులను వినియోగిస్తూ పనిచేయాలని అన్నారు. శాఖల మధ్య సమన్వయం ఉండాలని, సూపర్వైజర్ అధికారులను నియమించి, పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో ములుగు, భూపాలపల్లి అదనపు కలెక్టర్, వైవి గణేష్, దివాకర్,డిఆర్ఓ కే రమాదేవి, సీఈవోలు, డిఆర్డిఓలు, డిపిఓలు,డియంఅండ్ హెష్ ఓ లు, డిఈఓ లు, డిఎఓ లు, డిడబ్లుఓలు, ఎపిడివోలు, ఎంపిడివో లు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.