Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్.రంగయ్య
- పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-నర్సంపేట
పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ధరలను పెంచేసి ప్రజలపై తీరని భారం మోపిందన్నారు. పాలు, పెరుగు తదితర ఆహార పదార్థాలపై జీఎస్టీ 12 శాతానికి పైగా పెంచడం వల్ల ధరలు పెరిగి సామాన్య, పేదలు కొనుగోలు చేయలేని స్థితికి చేరుకున్నాయన్నారు. ప్యాకింగ్ పేరిట ఉన్న డ్రైఫుడ్, కోడిగుడ్లు, కూరగాయలు, అల్లం, పసుపు వంటి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు.పెట్రోల్, డీజిల్పై కేంద్రం 31శాతం, రాష్ట్రం 23శాతం పన్నులు విధించడం వల్ల రూ.100 నుంచి 120 వరకు పెరుగుతుందనన్నారు. 2014లో రూ.450 ఉన్న వంట గ్యాస్ ధర రూ.1185 పైగా పెరిగిందన్నారు. సబ్సిడీ ఎత్తేసినందున వంట గ్యాస్ ధరలు అదపులో లేకుండా పోయిందని తెలిపారు. ఈ ధరల వల్ల వాహనాలపైనే కాకుండా నిత్యావసర ధరలు పెరిగాయని తెలిపారు. మరో వైపు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీనిచ్చిన ప్రధాని మోడీ ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే చర్యలకు పాల్పడ్డాడని విమర్శించారు. ఇప్పటికే 80శాతం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ బడా శక్తులకు అప్పనంగా అమ్మేసి ఉద్యోగాలను కొల్ల గొట్టాడన్నారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు బీజేపీ ప్రభుత్వం మతం పేరిట పక్కదోవ పట్టిస్తూ ప్రజలను విభజించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని దుయ్యపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగట్టాలని దీనికోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తీవ్రమైన పోరాటాలు చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, నాయకులు కత్తిద కట్టయ్య, పెండ్యాల సారయ్య, హన్మకొండ సంజీవ, బుర్రి ఆంజనేయులు, రుద్రారపు లక్ష్మీ, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన, దిష్టిబొమ్మ దహనం..
పెరిగిన ధరలను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పట్టణంలోని వరంగ్ రోడ్డు కూడలిలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరల ను పెంచేసి పేదలు, సామాన్యులపై భారాలు మోపిందన్నారు. బీజేపీ పాలనను అంతమొందించేందుకు ప్రజలు పోరాటాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమం లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అనంతగిరి రవి, గుజ్జుల ఉమా, పట్టణ నాయ కులు సింగారపు బాబు, కలకోటి అనిల్, వజ్జంతి విజయ, గణిపాక ఇంద్ర, తాళ్ల పెల్లి ప్రవళిక, ఎడ్ల శివలక్ష్మి, మోలుగురి రాజు, యాకలక్ష్మి నాగమణి, తోటకూరి రాజేష్, వీరన్న, నర్సింహా రాములు, తదితరులు పాల్గొన్నారు.
రంగశాయిపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
మట్టెవాడ : జీఎస్టీ పేరుతో పన్నులను పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు ఆర్థికంగా చితికి పోతున్నారని సిపిఎం రంగశాయిపేట ఏరియా కమిటీ కార్యదర్శి మాలోత్ సాగర్ అన్నారు. శనివారం రంగశాయిపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీవో ఆఫీస్ నాయుడు పంపు జంక్షన్ వద్ద బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ల పరం చేసేలా ప్రయత్నాలు కొనసాగిస్తుందన్నారు. 80 శాతం ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మడానికి ప్రయత్నాల్లో ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాల్లో నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడి పెంచిన ధరలు తగ్గించి, గ్యాస్ ప్రైస్ సబ్సిడీ పునరుద్ధరించాలని, కరెంటు చార్జీలు బస్సు చార్జీలు తగ్గించాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం రంగశా యిపేట ఏరియా కమిటీ సభ్యులు గానేపాక ఓదేలు,ఎం.ప్రత్యుష్య,జ్యోతి, మూర్తి, లక్కా రమేష్, కృష్ణ, రామ సందీప్, సోషల్ మీడియా కార్యదర్శి గజ్జ చందు, కెవిపిఎస్ నాయకులు ఉసిల్ల కుమార్ , మౌనిక,ఎమ్మాడి శ్రీనివాస్,ఇర్ల హరినాధ్, పిఎన్ఎం జిల్లా అధ్యక్షులు అనిల్,ఆవాజ్ కమిటీ అధ్యక్షకార్యదర్శులు ఎండి అజ్జు, అథిక్, సీపీఎం పార్టీ శాఖ కార్యదర్శులు కిట్టు, భారత్, శ్రీకాంత్, కొత్తూరి రాజు, అనిల్, లకిడి లక్ష్మీ, కవిత, వెంకటలక్ష్మి, పార్టీ సభ్యులు,ప్రజా సంఘాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఖిలా వరంగల్ : కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం కరీమాబాద్ సిపిఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శాకరాసికుంట ఎస్బిఐ బ్యాంకు వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ముక్కెర రామస్వామి పాల్గొని మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రజా వ్యతిరేక విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తుందన్నారు. ఈ విధానాలతో సామాన్య ప్రజానీకం బతుకు భారం అవుతుం దన్నారు. బిజెపి ప్రభుత్వం ఈ విధానాలను మానుకోవాలని లేదంటే మరిన్ని ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గున్నాల ప్రభాకర్, సిఐటియు ఉపేందర్, చందా యాకమ్మ, సరిత, అప్పాజీ, శ్రీవాణి పాల్గొన్నారు.
కాశిబుగ్గ సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో
కాశిబుగ్గ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని సిపిఐ (ఎం) కాశిబుగ్గ ఏరియా కమిటీ కార్యదర్శి మహమ్మద్ బషీ ర్ అహ్మద్ డిమాండ్ చేశారు. శనివారం కాశిబుగ్గ జంక్షన్ లో బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బషీర్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పన్నులు పెంచడంతోపాటు ప్రభుత్వ రంగ సం స్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తుందని మండపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం ఏరియా కమిటీ నాయకుడు పరిమళ గోవ ర్ధన్ రాజు కమిటీ సభ్యులు సదానందం, అజరు, వరుణ్ ,మధు, మహేందర్, రమేష్ ,సుదీర్, దేవేందర్, రాజు సుమన్, అజరు చైతన్య, కళ్యాణి, ప్రేమలత, దార సునీత, దేవి, సంధ్య, ఈశ్వరమ్మ, హర్ష, తదితరులు పాల్గొన్నారు.