Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ, కృష్ణా కాలనీ, టీ-2 క్వార్టర్స్, పైలట్ కాలనీల్లో చెత్తకుండీ ల్లో, సైడ్ కాల్వల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. సింగరేణి కాంట్రాక్ట్ (పారిశుద్ధ్య) కార్మికులు 16 రోజులుగా సమ్మె చేస్తున్న సందర్భంగా వాటిని శుభ్రం చేసే నాథుడే లేని పరిస్థితి నెలకొంది. ఆదివారం బతుకమ్మ పండుగ మొదలవడంతో కాలనీల్లో దసరా పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలు తుండగా కాలనీల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారు. సింగరేణి యాజమాన్యం, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని కాలనీల్లో చెత్తను తొలగింపజేసి పరిశుభ్ర వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.