Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎంకు వినతి
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
మైనింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. మైనింగ్ సిబ్బంది సమస్యలపై, అనారోగ్య కారణాల వల్ల మెడికల్ అన్‌ఫిట్ అయిన మైనింగ్ సిబ్బందికి సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని మెమోరాండం ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోట పలుకుల రమేష్, మైనింగ్ స్టాఫ్ ఇన్‌ఛార్జి తోట రామచందర్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ ఆసిఫ్ పాషా, రాజ్ మహ్మద్, సుధాకర్, లక్ష్మణమూర్తి, రాజారామ్, శ్రీనివాస్, అప్పం రాములు తదితరులు పాల్గొన్నారు.