Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆపరేషన్‌కు రూ.30 లక్షల్చు ఖర్చు
- దాతల కోసం బాధితుల ఎదురుచూపు
- తమకుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని కుటుంబం వేడుకోలు
నవతెలంగాణ-గార్ల
గార్ల మండలంలోని మద్దివంచ గ్రామ పంచాయతీ పరిధి కొత్తతండాకు చెందిన ధారావత్ బాబురావు-సురేఖ దంపతులకు తొలి సంతానంగా బాబు(అన్వేష్) జన్మించాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న క్రమంలో మొదట్లో అనారోగ్యంగా ఉన్నాడు. దీంతో వరంగల్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో వైద్యం చేయించగా సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు అయింది. అనంతరం ఖమ్మం లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో వైద్యం చేయించగా రూ.50 వేలు ఖర్చు అయింది. అయినా ఆరోగ్యం కుదటపడలేదు. ఈక్రమంలో వైద్యులు మీ బాబుకు 'తలసీమియా' ప్రాణాంతక వ్యాధి అంటూ వైద్యులు బాధిత దంపతులకు పిడుగులాంటి వార్త చెప్పారు. ఆ షాక్ నుంచి తేరుకుని బాబుని బతికించాలని వైద్యం కోసం ఆసుపత్రులు తిరిగి ఉన్న కొద్దిపాటి భూమి, ఇళ్లు ఉన్నదంత అమ్ముకొని సర్వం ధార పోశారు. అయితే ఒక ఆపరేషన్ చేయడం ద్వారానే బాబు ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉందని వైద్యు లు చెప్పడంతో పెట్టడానికి డబ్బులు,అమ్మడానికి ఆస్తులు లేక దాతల ఆపన్న హస్తం కోసం పేద గిరిజన దంపతులు ఎదురు చూస్తున్నారు.
రూ.30లక్షల ఖర్చు
అవుతుందంటున్నారు : బాధిత దంపతులు
ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కి స్తున్నారు. ఇందుకు రూ.5వేల చొప్పున ఏడాదిగా ఖర్చు చేస్తున్నాం. హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకెళ్తే సంవత్సరం వయస్సు దాటిందని, ఆపరేషన్ చేయించాలని వైద్యులు చెప్పారు. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ నిమిత్తం బెంగుళూరు హాస్పటల్కుకి వెళ్లాలని, ఆపరేషన్‌కు రూ.30 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఇప్పటికే మాకు ఉన్న ఇంటిని, 25 గుంటల వ్యవసాయ భూమిని అమ్మాం. అప్పు లు చేసి బాబుకు వైద్యం చేయిం చాం. మా బాబు ప్రాణాలు నిలవాలంటే ఆపరేషన్ చేయించాలి. అంత డబ్బు మా దగ్గర లేదు. ప్రభుత్వ సహకారంతోపాటు ఎవరైనా దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నాం. దాతలు 7702009738లో సంప్రదించి సహాయమందించి బాబు ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాం.