Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 28 నుంచి తొర్రూరులో రాష్ట్రస్థాయి క్రీడలు
- షూటింగ్ బాల్ అసోసియేషన్
- రాష్ట్ర అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-తొర్రూరు
షూటింగ్ బాల్ క్రీడకు రాష్ట్రంలో ఆదరణ లభిస్తోందని షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 28 నుంచి 30 వరకు తొర్రూరులోనిజడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయి క్రీడల పోస్టర్లను ఆదివారం మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, క్రీడల కన్వీనర్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ క్రీడల్లో 33 జిల్లాల నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు హాజరు కానున్నారని తెలిపారు. షూటింగ్ బాల్ క్రీడకు గ్రామీణ ప్రాంతాల్లో విస్తత ప్రాచుర్యం కల్పించ డంలో భాగంగా మ ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత్ లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ క్రీడ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని తెలిపారు. దేశంలో క్రీడామంత్రిత్వ శాఖ గుర్తించిన అన్ని క్రీడలతో సమానంగా షూటింగ్బాల్కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో దీనిపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. వ్యాయామ విద్యలో షఉటింగ్బాల్ను భాగం చేయాలని కోరామన్నారు. క్రీడా పాలసీ తయారీకి, క్రీడల అభివద్ది, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేబినేట్ సబ్‌కమిటీని నియమించిందన్నారు. ఇందు కోసం వివిధ దేశాల క్రీడా పాలసీలను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. క్రీడల అభివద్ధి, ప్రోత్సాహం కోసం క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2శాతం, ఉన్నత విద్య కోసం 0.5శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు ఇప్పటివరకు రూ. 25.87 కోట్ల నగదు ప్రోత్సహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మిం చేందుకు కృషి చేస్తోందన్నారు. క్రీడాకారులను, కోచ్ లను రాష్ట్ర క్రీడా శాఖ ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడా కారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో క్రీడల్లో సరైన పథకాలు రాలేదని, కేంద్ర ప్రభుత్వం షూటింగ్ బాల్ క్రీడకు సరైన ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతా రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి,షఉటింగ్ బాల్ రాష్ట్ర కార్యదర్శి చెడుపల్లి ఐలయ్య, పిడి సతీష్ , టిఆర్ఎస్ నాయకులు కర్నే నాగరాజు, మణిరాజ్, ఎర్ర సంపత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.