Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్
- యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి
నవతెలంగాణ-మరిపెడ
అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి కోరారు. మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామంలో యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు బెస్త సంపూర్ణ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా జయలక్ష్మి హాజరయ్యారు. బతుకమ్మ సంబరాల సందర్భంగా అంగన్వాడీ టీచర్లు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పి జయలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఐసిడిఎస్ కేంద్రాలను ప్రైవేటీకరణ చేసే ధోరణి మానుకోవాలన్నారు. 2018 లో పెంచిన వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే ఈవెంట్స్ కార్యక్రమాలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాలని కోరారు. బీఎల్ఓ లుగా అదనపుబాధ్యతలు అప్పజెప్పి పని భారం మోపడం తగదన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు సరోజ, మరిపెడ ప్రాజెక్టు అధ్యక్షురాలు బాష్పంగు ఉమా, సెక్టార్ లీడర్ సిహెచ్ రాములమ్మ, అంగన్వాడీ నాయకురాలు బి మంగమ్మ, కె లక్ష్మీకాంత, జి కమల, ఏ కష్ణకుమారి, పూర్ణ, సంధ్య, మల్లికాంబ, డి లలిత, కె ఉమా, తదితరులు ఉన్నారు.