Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్
నవతెలంగాణ-లింగాలఘనపురం
లింగాలఘనపురం మండల పరిధి కళ్లెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఈనెల 28న జీడికల్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సీపీఐ(ఎం) పాదయాత్ర చేపడుతున్నామని, జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ట శేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం సంబం ధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం మబ్బు ఉప్పలయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శేఖర్ మాట్లాడారు. స్టేషన్నియోజకవర్గానికే తప్ప మండలంలోని జీడికల్, సిరిపురం, కళ్లెం,ఎనబావి ,నాగారం, గ్రామాల సమస్యల పరిష్కారంపై పాలకులు దృష్టిపెట్టడం లేదన్నారు. జీడికల్ నుండి జనగామ వరకు రోడ్డు గుంతలమయంగా మారిందని, అనేక ప్రమాదాలు జరు గుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాలోనే అతిపెద్ద దేవస్థా నమైన రాముల వారి గుడి కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల రోజుల పాటు పూజలు నిర్వహిస్తారని, ఆలయానికి వెల్లే వారు రోడ్డుసరిగా లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అత్యవసర సేవల కోసం జనగామకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారన్నారు. సిరిపురం నుండి మండల కేంద్రానికి రోడ్డు మార్గమే లేదన్నారు. ఇవేమీ స్థానిక ఎమ్మెల్యేకు కనినపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బొడ్డు కరుణాకర్, మండల కమిటీ సభ్యులు తూటి దేవదానం శంకరయ్య, రాపోలు సమ్మయ్య, చెన్నూరు ఉప్పలయ్య, నాయకులు మబ్బు వెంకటేష్, తాటిపాముల రాఘవేంద్ర, చింత ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.