Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
ఆర్టీసీతోనే సురక్షిత ప్రయాణం సాధ్యమని మంథని డిపో మేనేజర్ (డీఎం) శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించాలని ఆయన కోరారు. మండలం లోని తాడిచెర్ల, పెద్దతూండ్ల గ్రామాల్లో జోన్ కళా బందం సాంబయ్య ఆధ్వర్యంలో 'ప్రజల వద్దకు ఆర్టీసీ' ప్రదర్శనలు ఆదివారం నిర్వహించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ విజయలక్ష్మి, బస్టాండ్ క్లర్కులు కేఆర్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, డ్రైవర్ మల్లయ్య, కండక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కాటారం : మండలంలోని గారేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎం శ్రీనివాస్ మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సురక్షితమని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో పదో తరగతి వరకు స్కూల్ పిల్లలకు ఉచిత ప్రయాణం కల్పించినట్టు చెప్పారు. ప్రైవేటు వాహనాల్లో అధిక ధరలు చెల్లించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. కరీంనగర్ జోన్ కళా బందం సాంబయ్య నేతత్వంలో కళా ప్రదర్శన ద్వారా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మంథని డిపో బస్టాండ్ కంట్రోలర్ కుంభం రాజిరెడ్డి, డ్రైవర్ మల్లయ్య, కండక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.