Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న ఏఎస్ఐ.. భూవివాదాల వల్లే..
నవతెలంగాణ-శాయంపేట
భూవివాదాలతో విసుగెత్తిన కుటుంబం గ్రామంలో సర్పంచ్‌ను దుర్భషలాడడంతో ఆయన ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌కు పిలుస్తుండడంతో మనస్థాపం చెందిన వద్ధ దంపతులు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్మానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఏఎస్ఐ సమ్ములాల్ వారిని అడ్డుకున్నారు. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం... మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన కొడిమాల లక్ష్మి మల్లయ్య దంపతులకు సర్వే నెంబర్ 114/బిలో ఎకరం 5 గంటల భూమి తండ్రి ఓదెలు నుంచి వారసత్వంగా వచ్చింది. ఆ భూమిలోనే సాగు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బండ నారాయణరెడ్డి ఆ భూమిని తనకు ఇస్తే సర్వే నెంబర్ 507/బిలో చిట్టిరెడ్డి రాజిరెడ్డికి చెందిన 2.12 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి 1990 జనవరిలో రాజిరెడ్డి భూమి విక్రయించినట్లుగా అందుకు భయానాగా రూ.2 వేలు తీసుకున్నట్లు కాగితం రాసి ఇచ్చాడు. దాంతో వీరు రెండు ఎకరాల 12 గుంటల భూమిలో కాస్తులో ఉన్నారు. రాజిరెడ్డి ఆ భూమిని గ్రామంలోని అన్నబోయిన రఘుపతికి విక్రయించాడని బాధితులకు తెలియడంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో తీసుకెళ్లినట్లు తెలిపారు. నారాయణరెడ్డి ఎకరం ఐదు గంటల భూమి తీసుకొని, ఇచ్చిన రెండు ఎకరాల 12 గంటల భూమిని కూడా రాజిరెడ్డి రఘుపతికి అప్పగించడంతో, ఉన్న భూమి కోల్పోయి వద్ధాప్యంలో అవస్థలు పడుతుండడంతో ఆగ్రహంతో సోమవారం మార్కెట్లో సర్పంచ్ రాజిరెడ్డిపై దుర్బాషలాడారు. దీంతో సర్పంచ్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని బాధితులు తమకు సర్పంచ్ అన్యాయం చేస్తున్నారని విన్నవించుకున్నారు. భూమిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ ఆదివారం లక్ష్మీ మల్లయ్యలు పోలీస్ స్టేషన్ చేరుకొని ఆవరణలో తాము తెచ్చుకున్న బాటిల్ లోని పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడపొగా, ఏఎస్సై అడ్డుకొని వారిని వారించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదే విషయమై ఎస్సై ఇమ్మడి వీరభద్రరావును వివరణ కోరగా సర్పంచ్ రాజిరెడ్డి ఫిర్యాదు చేయడంతో వారిని ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించానని చెప్పారు. విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.