Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెల్పూర్ నుంచి వీరయ్యపల్లి వరకు రోడ్డు పనులకు రూ.2 కోట్లు మంజూరు
- బతుకమ్మ చీరలు పంపిణీ
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-గణపురం
మహిళల అభివద్దే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మండలంలోని చెల్పూర్, నగరంపల్లి, అప్పయ్యపల్లి, సీతారాంపురం, కొండాపురం గ్రామాల్లో లబ్దిదారులకు ఆదివారం ఆసరా పింఛన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మీ చెక్కులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. చెల్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి వీరయ్యపల్లి వరకు సీసీ రోడ్డు కోసం రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో మెడికల్ కాలేజీ కోసం నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. ఆసుపత్రి భవన నిర్మాణం కోసం రూ.1.70 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ నిధులు మంజూరయ్యే వరకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పట్టుదలతో వ్యవహరించారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పింఛన్ రూ.500లు చొప్పున మాత్రమే ఇస్తున్నారని, ద్విచక్ర వాహనం ఉన్న పేదలకు ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప అందరికీ పింఛన్లు ఇస్తున్నారని కొనియాడారు. పండగ పూట మహిళలు కొత్త బట్టలు లేవని బాధపడకుండా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దివాకర, డీపీఓ ఆశాలత, సర్పంచ్‌లు నడిపెల్లి మధుసూదన్‌రావు, కుమారస్వామి, ఐలోని శశిరేఖ, రాంచంద్రారెడ్డి, రామంచ భద్రయ్య, మామిడి రవి, సొసైటీ చైర్మెన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, గండ్ర సత్యనారాయణరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మెన్ సాంబారి సమ్మారావు, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, చెన్నూరి రమాదేవి, మధూకర్, సుధర్మ మలహల్రావు, మంద అశోక్‌రెడ్డి, తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ అరుంధతి, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పోలుసాని లక్ష్మీనర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏల వినతి
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతిపత్రం అందించారు. చెల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా మంత్రి దయాకర్‌రావుకు వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ పకిడే రాజయ్య మాట్లాడారు. రెండేండ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఇతర సమస్యలను సైతం పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. వీఆర్ఏల అన్ని సమస్యలనూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చెన్నూరి సమ్మయ్య, నాయకులు ముక్కెర కుమారస్వామి, గంధం సుమతి, పక్కల రవీందర్, చెలుమళ్ల సంపత్, రాచకొండ మురళీ, బొల్లం భిక్షపతి, రమేష్, రవి, భాగ్యమ్మ, మమత, స్వప్న, జితేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.