Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలకు తూట్లు
- టీఎస్ఆర్టీసీ ఇష్టార్యాజ్యం
- 14 స్టాల్స్‌కు గడువు ముగింపు
- 8 స్టాల్స్‌కు టెండర్ల నిర్వహణ
నవతెలంగాణ-వెంకటాపురం
అంతా నా ఇష్టం...ఎడాపెడా ఏం చేసినా అడిగే దెవ రురా నా ఇష్టం.....అన్న సినిమా పాట చందంగా తయా రైంది. భద్రాచలం టీఎస్ ఆర్టీసీ డిపో పరిధిలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బస్టాండ్ ఆవరణలో ఉన్న స్టాల్స్‌కు నిర్వహించిన టెండర్ల పరిస్థితి. ఈ స్థలాల కేటా యింపునకు సంబంధించిన టెండర్లు ఈనెల 6న ఖమ్మంలో నిర్వహించారు. షాపుల కేటాయింపు టెండర్లలో కనీసం నిబం ధనలు పాటించలేదని షాపుల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్‌లో బస్టాండ్‌లోని 16 స్టాల్స్ గడువు ముగియనుంది. వాటికి సంబంధించి 8 స్టాల్స్ నిర్వహణ గడువును మరో ఏడాది పాటు పెంచిన ఆర్టీసీ అధికారులు 8 స్టాల్స్‌కు సంబంధించి ఓపెన్ ప్లేస్‌కు టెండర్లు పిలిచారు. ఆ టెండర్లలో కనీస నిబంధనలు పాటించలేదని షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. మండలంలో మొత్తం 20 రకాల వ్యాపారాలకు సంబందించి 10/10 అడుగుల ఓపెన్ ప్లేస్‌ల కు టెండర్లు నిర్వహిస్తున్నారు. అందులో 5, 10, 14 నెంబర్ల స్టాల్స్‌కు సంబంధించి అద్దె సక్రమంగా చెల్లించడంలేదని ఆ స్టాల్స్‌ను టెర్మినెంట్ చేసి జూన్‌లో టెండర్లు నిర్వహించారు. ఇంకా రెండు స్టాల్స్‌కు కొంత గడువు ఉంది. మిగిలిన స్టాల్స్ నిర్వాహణకు టెండర్ల గడువు నవంబర్‌తో ముగుస్తుంది. అయితే స్టాల్స్ నెంబర్ 1,6,7,8,9,11,12,18 నెంబర్లకు సంబంధించిన స్టాల్స్ నిర్వహణ గడువును మరోఏడాది పెం చారు. మిగిలిన 3,4, 11, 13,15,16,17, 23 స్టాల్స్ సంబందించిన టెండర్ల ప్రక్రియలో టీఎస్ ఆర్టీసీ నిబం ధనలు పాటించలేదని స్టాల్స్ నిర్వాహకులు వాపోతున్నారు.
కనీస నిబంధనలు పాటించని ఆర్టీసీ
టెండర్ల నిర్వహణలో టీఎస్ ఆర్టీసీ నిబంధనలు పాటిం చలేదని నిర్వాహకులు వాపోతున్నారు. 13,15,16,17 స్టాల్స్ కు సంబందించి 28-07-2012లో వెంకటాపురం బస్టాం డ్లో ఓపెన్ స్థలానికి నిర్వహించిన టెండర్లను దక్కిం చుకు న్నారు. ఆ గడువు 19-07-2017తో ముగిసింది. తిరిగి నిర్వహించిన టెండర్లను దక్కించుకొని వ్యాపారం చేసుకుం టున్నారు. 10 సంవత్సరాలుగా స్టాల్స్ నిర్వాహణలో ఉన్న వారికి ఏడాది గడువు ఎందుకు పెంచలేదని నిర్వాహకులు ఆర్టీసీ అధికారులను నిలదీస్తున్నారు.
ముందస్తు నెల అద్దె చెల్లించలేదనే సాకుతో..
ఆగస్టు నెలకు సంబంధించిన నెలకు ముందస్తు అద్దె చెల్లించలేదనే సాకును ఆశగా చూపి ఆదుకాణాల టెండర్లను రద్దు చేసినట్లు ప్రచారం. 2012 కు సంబంధించి ఆర్టీసీ వారికి దుకాణదారులు ముందస్తుగా చెల్లించిన ఈఎండీ సొమ్ము రూ.15,618తో పాటు 2017 సంవత్సరానికి సంబందించిన ఈఎండీ సొమ్ములు రూ. 35 వేల వరకు ఆర్టీ సీ వారి వద్దే ఉంది. టెండర్లు ముగిసిన 30 రోజుల్లో తిరిగి ఆర్టీసీ వారు చెల్లించాలి కానీ ఆ సొమ్ములను స్టాల్స్ నిర్వాహ కులకు ఆర్టీసీ నేటికి చెల్లించలేదని చెబుతున్నారు. డిపాజిట్లు వారి వద్ద ఉన్నా నెల అద్దె చెల్లించలేదనే సాకుతో మా షాపులు టెండర్లు నిర్వహించడం అన్యాయమని వాపోతున్నారు.
కరోనా సమయంలోనూ వడ్డీతో అద్దె వసూలు
కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఆ సమయంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సం బంధించి అద్దెను పూర్తిగా జూలై, ఆగస్టు నెలలకు సంబం దిం చిన అద్దెలో 50 శాతం మినహాయించి అద్దె వసూలు చేయా లని హైకోర్టు ఆదేశించినా ఆ కాలంలో అద్దెను వడ్డీతో వసూ లు చేశారని స్టాల్స్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస నిబంధనలేవి..
స్టాల్స్ టెండర్ల నిర్వహణలో ఆర్టీసీ అధికారులు కనీస నిభందనలు పాటించలేదని స్టాల్స్ నిర్వాహకులు వాపో తున్నారు. గడువు ముగిసినా అన్ని దుకాణాలకు సంబం దించిన స్టాల్స్‌ను టెెండర్లు పెట్టకుండా కొన్ని స్టాల్స్‌కు మినహా యింపు ఎందుకు ఇచ్చినట్లో టీఎస్ ఆర్టీసీ వారికే తెలియాలి. 10 ఏళ్లుగా బస్టాండు సమీపంలో స్టాల్స్ నిర్వహిస్తున్నారు. వారికి కనీసం టెండర్లు ప్రకటించినట్లు స్టాల్స్ నిర్వాహకులకు సమాచారం కానీ , ఆర్టీసీ నుంచి నోటీసులు గాని ఇవ్వకుండానే టెండర్లు ప్రకటించారని వాపో తున్నారు. ప్రతి నెలా అద్దె చెల్లించాలని ప్రతి రోజు పోను, సాంఘీక మాద్యమాల్లో పోస్టులు చేసే అధికారులు, స్టాల్స్ నిర్వాహకులకు టెండర్లు ప్రకటించినట్లు కనీస సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు.
కనీసం నోటీసులు ఇవ్వకుండానే టెండర్లు...
- వంకా రాములు, స్టాల్ నెంబర్ 16
సంవత్సరం గడువు పెంచాం అధికారులకు దరఖాస్తు చేసుకోమన్నారు. జూన్‌లో దరఖాస్తు పంపించా. ముందస్తు నెల అద్దె కట్టలేదనే సాకుతో నా స్టాల్ 16కు ఆర్టీసీ వారు టెండర్లు పెట్టారు. నా కు కనీస సమాచారం ఇవ్వక పోవడంతో నేను టెండర్లలో పాల్గొన లేదు. 10 ఏళ్లుగా స్టాల్ నిర్వహించు కుంటున్న టెండర్లు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వారు నాకు ఎటువంటి నోటీసుగానీ సమాచారంగాని ఇవ్వలేదు. నా ఈఎండీ సొమ్ములు 2012కు సంబంధించి 2017కు సంబంధించి సుమారు రూ.50వేలకు పైగా ఆర్టీసీ వద్ద ఉన్నవి. ఒక నెల అది ముందస్తుగా అద్దె చెల్లించలేదని టెండర్లు ఎలా పిలుస్తారు.
అద్దె వడ్డీతో వసూలు చేశారు
- సున్నం రమేష్, స్టాల్ నెంబర్ 17 నిర్వహకుడు
కరోనా సమయంలో ప్రభుత్వం అన్ని దుకాణాలు మూసే ఉన్నాయి. ఆ సమ యంలో మా వద్ద వడ్డీతో సహా అద్దెలు వసూలు చేశారు. టెండర్ల ముగి సిన కొన్ని దుకాణాలకు ఆర్టీసీ అధికా రులు టెండర్లు ఎందుకు నిర్వహిం చలేదు. కొన్ని దుకా ణాలకు మాత్రమే టెండర్లు పిలవడం వెనక ఆంతర్యమేమిటో అనే విషయం పై ఉన్నతాధికారులు విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి.
ఈ టెండర్ల విష యంపై భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్‌ను వివరణ కోరెం దుకు పలుమార్లు ఫోన్లో సంప్రదించగా కనీసం స్పందిం చలేదు.