Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు
- కమిటీల పేరుతో నీరు కారుస్తున్న వైనం
- ఐదు బెడ్రూమ్లకే బిల్లులు మంజూరు
- ఇబ్బందుల్లో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు
నవతెలంగాణ-వెంకటాపూర్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిష్టాకంగా సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూంలు మంజూరు చేయగా అందులో మండల కేంద్రానికి చెందిన 51 మంది కుటుంబాలకు వచ్చాయి. నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి రూ.5.4 లక్షలు మంజూరు చేయగా 2018లో మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ డబుల్ బెడ్ రూమ్‌లకు శంకుస్థాపన చేసి ఆయన పేరుపైనే కాలనీ నామకరణం చేసినట్లు లబ్ధిదారులు తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి నాలుగేళ్లు గడిచినా సరైన సమయంలో బిల్లులు రాకపోవడంతో కొన్ని ఇళ్లు పునాదులకే పరిమితమై మరికొన్ని పిల్లర్ల వరకు పనులు జరిగాయి. అందులో 5 ఇండ్లకు మాత్రమే బిల్లులు మంజూరై పూర్తయినట్లు చెబుతున్నారు. ఐదేండ్లకు మాత్రమే బిల్లు రావడం ఏంది.. మిగతా వారికి రాకపోవడం కారణం ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోక పోవడంతో పనులు పూర్తి కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్స్ మంజూరైన కొన్ని రోజులకు మండల కేంద్రానికి చెందిన కొందరు నా యకులు ఎస్సీ, ఎస్టీల్లో నలుగురు నుండి ఐదుగురి వరకు కమిటీలు ఏర్పాటు చేవారు. ఈ కమిటీలో ఎవరి ఇష్టం అను సారంతో వారే వ్యవహరించడం మొదలుపెట్టారని పేర్కొ న్నారు. డబుల్ బెడ్రూమ్లో వద్ద కాపుల దారులు లేకపో వడంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సిమెంటు, ఐరన్, కంకర ఇసుక అపహరించుకుపోయారు. వాటి గురించి పట్టించుకునే వారే నాథుడే లేడని సమాచారం. కొందరు లబ్ధిదారులు ఇసుక, సిమెంటు, ఐరన్, ఇటుకలు విక్రయిం చి నట్లు విశ్వసనీయ సమాచారం. డబల్ బెడ్రూమ్లకు ఇన్ చార్జి అధికారి లబ్ధిదా రులతో కుమ్మక్కై ఇష్టారాజ్యాంగ వ్యవ హరించడంతో ఇండ్లు పూర్తి కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి పూర్తయ్యేవిధంగా కృషి చేయాలని కోరుతున్నారు.
నాలుగేళ్లయినా కానరానీ గహప్రవేశాలు
- జంగిలి శ్రీలత రవియాదవ్ ఎంపీటీసీ-1, వెంకటాపూర్
డబుల్‌బెడ్ రూంలు మంజూరై నాలుగేళ్లు అయినా గృహ ప్రవేశానికి మాత్రం నోచు కోలేదు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇండు పూర్తయ్యేంతవరకు బిల్లులు మంజూరు చేసి పూర్తయ్యే విధం గా కృషి చేశారు. ఇప్పటి ప్రభుత్వం మంజూరైన ఇండ్లు పూర్తిగా నిర్మిం చలేదన్నారు. వెంటనే బిల్లులు మంజూరు చేసి పూర్తి నిర్మాణాలు చేపట్టి త్వరగా గహప్రవేశాలు చేపట్టాలన్నారు.
మాకు మాత్రమే బిల్లులు వచ్చాయి
-ముసలి లింగయ్య, లబ్దిదారుడు
ఎస్సీ కులాలకు 51 మందికి ప్రభుత్వం నుం డి ఇల్లు మంజూరయ్యాయి. అందులో మా ఐదు గురికి రూ. 5 లక్షల చొప్పున పూర్తి బిల్లు వచ్చింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ పూర్తిగా నిర్మించుకున్నాం.