Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవలో ముందు.. పిఆర్సీలో వెనుకంజ
- సిబ్బందికి బతుకు భారం
నవతెలంగాణ-వరంగల్
తెలంగాణ రాష్ట్రంలో యుపిహెచ్సి వంటి వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పిఆర్సీ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021 నుండి ఇప్పటి వరకు పి ఆర్ సి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో చాలీచాలని వేతనాలు తీసుకొని బతుకు బండి సక్ర మంగా సాగాక అప్పుల్లో కూరుకుపోతున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఎన్.హెచ్.ఎం.స్కీంలో పని చేస్తున్న సుమారు 15 వేల మందికి పీఆర్సీ వెంటనే విడుదల చేయాలని ప్రధాన కార్యాలయాల ఎదుట నిరసనలు చేసినప్పటికీ ఇంతవరకు సక్రమంగా వేతనాలు అందటం లేదన్నారు. రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్‌లో పనిచేస్తున్న సుమారు 15 వేల మంది ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్, హెల్త్ డిపార్ట్మెంట్ పీ.అర్.సి. రిలీజ్ డేట్ 16/12/2021. జీ.ఓ.730 ప్రకారం ఆరు నెలల పీ.ఆర్.సి. ఎర్రేర్స్ జూలై 2021 నుండి జనవరి 2022 వరకు ఆరు నెలలు బకాయిలు చెల్లించలేదని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పిఆర్సి విడుదల చేయాలని అంటున్నారు.
పీఆర్సీ వెంటనే విడుదల చేయాలి
- రామా రాజేష్ ఖన్నా
నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో పని చేస్తున్న ఎంప్లాయిస్ వేతనాలు సమయానికి అందక పోయి నా ప్రజాసేవలో ముందుగా నిలిచి సేవలు అంది స్తున్నామన్నారు. దసరా, దీపావళి పండుగలు వచ్చే నెలలో ఉన్నాయని వెంటనే బకాయిలు విడు దల చేయాలని, అలాగే కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎన్.హెచ్.ఎం.స్కీం ఉద్యోగులను అందరిని క్రమబద్ధీకరణ చేయాలన్నారు.