Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టుల కోసమే పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి
- మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
తెలంగాణకు ఏం చేశారని బిజెపి నేతలు మునుగోడులో ఓట్లు అడుగు తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలంలోని సోలిపురంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు దాటినా డిండి, చర్లగూడెం, కిష్టరా యినిపల్లి, బ్రాహ్మణ వెల్లంల, రాచకొండ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయ లేదని ప్రాజెక్టుల కోసం గుంజుకున్న రైతుల భూములకు పరిహారం ఇవ్వకుండా రైతులను క్షోభకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చండూరు, నాంపల్లి రహదారిని డబుల్ రోడ్డుగా మారుస్తామని, ఫ్లోరోసిస్ బాధితులకు పింఛన్ హామీని మరిచారన్నారు. తెలంగాణలో సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కేవలం ఉప ఎన్నికలపైనే టీఆర్ఎస్, బీజేపీలు దష్టి పెట్టాయని ఆరోపించారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, చుండూరు నాంపల్లి రోడ్డును డబల్ రోడ్డుగా మార్చే హామీని విస్మరించారని, ఫ్లోరోసిస్ బాధితులకు పింఛన్ ఇవ్వడంలేదని సీతక్క కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.