Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాటి మహానుభావుల పోరాట పటిమతో ముందుకు
- శత జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే నరేందర్
నవతెలంగాణ-మట్టెవాడ
నాటి స్వతంత్ర సమరయోధుడు , రజాకార్లతో పోరా డిన పోరాట యోధుడు బండారు చంద్రమౌళీశ్వర రావు శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఆదివారం వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని ఎన్ఆర్ఐ ఆడిటో రియంలో బండారు చంద్రమౌళీశ్వర రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన మేనేజింగ్ ట్రస్టీలు ఉమామహేశ్వరరావు, ధవలేశ్వరరావు, పర్యవేక్షణలో ఘనం గా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీ య చరిత్ర పరిశోధన పరిషత్ పూర్వ అధ్యక్షులు, యల్లాప్రగడ సుదర్శన్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ట్రస్ట్ నిర్వాహకులతో కలిసి బండారు చంద్రమౌళీశ్వర రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సాహితీవేత్త శివశ్రీ ముదిగొండ శివప్రసాద్ కి అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సభికులతో కలిసి ప్రముఖ డాక్టర్ కవి రచయిత మేనేజింగ్ ట్రస్ట్ బం డారు ఉమామహేశ్వరరావు రచించిన మనో మేఘం కవిత సంచిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ నాడు స్వతంత్రం కోసం తెలంగాణ రాష్ట్రం లో రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన మహానుభావులలో బండారు చంద్రమౌళీశ్వర రావు ఒకరు అని అన్నారు. చంద్రమౌళి, కాళోజీ, ఇటుకాల మధుసూదన్, మొగిలయ్య గౌడ్ల పోరాటాలను కీర్తించటం జరిగిందని గుర్తు చేశారు. ఆ మహానుభావుల స్ఫూర్తితో వరంగల్ జిల్లాను అభివద్ధి పథంలో తీసుకు వెళ్లడంలో తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. మేనేజింగ్ ట్రస్టీలు మాట్లాడుతూ నాడు ఉన్న పరిస్థితులు నేడు లేవని స్వేచ్ఛగా జీవిస్తున్నప్పటికీ అభివృ ద్ధి లో అట్టడుగున ఉండడమే బాధాకర విషయమన్నారు. దేశం గురించి పోరాడిన మహానుభావులను నేటితరానికి తెలి యకపోవడం దురదృష్టకరమన్నారు. ట్రస్టు ద్వారా ఉత్త ములకు పురస్కారాలు ప్రతియేడాది అందిస్తారన్నారు. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, గన్నమరాజు గిరిజ మనోహర్రావు, ప్రముఖ కవియిత్రి, రచయిత్రి, కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవి, పాల్గొన్నారు.