Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మహిళ ప్రజాప్రతినిధులు, మహిళలు యువతులు చిన్నపిల్లలు సాంప్రదాయబద్ధమైన తయారై తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చుకొని మహిళలు ఎంగిలిపూల బతుకమ్మలను గ్రామాల్లోని దేవాలయాలకు తరలివెళ్లారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఆంగోత్ అరుణ మహిళా వార్డు కౌన్సి లర్లు బతుకమ్మలతోనే శ్రీరాముల వారి దేవాలయానికి చేరు కున్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ మహిళలు తారతమ్యాలు మరిచి బతుకమ్మ పాటలతో సంతోషంగా జరుపుకోవడం ఆనందంగా ఉంద న్నారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు తోటకూరి రాజమణి, కొండేటి అనిత సత్యం, పూజారి సుజాత రఘు, పాలకుర్తి సారంగపాణి, కోదాటి పద్మ, బానోత్ అనిత, భూక్య సరిత, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండల వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మను ఆదివారం మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆటను ఆడుకున్నారు. మండలంలోని చల్వాయి పసర గోవిందరావుపేట దుంపెల్లి గూడెం బస్సాపూర్ మచ్చాపూర్ రాఘవపట్నం రంగాపూర్ ప్రాజెక్టు నగర్ ముట్ల గూడెం గాంధీనగర్ ముద్దుల గూడెం లక్ష్మీపురం కర్లపల్లి గ్రామాలోల మహిళలు బతుకమ్మను పేర్చి సాయంత్రం చెరువు గట్ల మీద కాలువ కట్టమీద కుంట కట్టమీద పాటలు పాడుతూ కోలాటం వేస్తూ బతుకమ్మ పాటలు పాడి చివరకు బతుకమ్మను సమీపంలోని నీటిలో జారవిడిచారు.
ఖిలావరంగల్ : 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మా రవి ఆదివారం ఎస్ఆర్ఆర్ తోటలోని తన స్వగృ హంలో బతుకమ్మను పేర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు బతుకమ్మను ఉత్సాహంగా తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించుకుంటారన్నారు. ఆమె తో పాటు కుటుంబ సభ్యులు పల్లం రిషిత పాల్గొన్నారు.
తాడ్వాయి : తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ విశిష్టతను ఆడపడుచులు ప్రపంచానికి చాటారు. గ్రామాలు, పట్టణాలు ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. ఆదివారం నుండి బతుకమ్మ ప్రారంభం కావడంతో ఏజెన్సీలోని గ్రామాలన్నీ పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేశారు.
మంగపేట : ఎంగిలి పూల బతుకమ్మను మండలం లోని మహిళలు యువతులు ఆదివారం అట్టహాసంగా నిర్వ హించారు. తెల్లవారు జామునుండే మహిళలు గ్రామాల్లో తిరుగుతూ తీరొక్కపూలను సేకరించి తల స్నానాలు చేసి ఉపవాసాలతో ఎంగిలి పూల జతుకమ్మలను పేర్చుకున్నారు. ఎస్సై తాహిర్ బాబా ఆధ్వ ర్యంలో నాలుగు సివిల్, సీఆర్పీ ఎఫ్ పోలీస్ బృందాలను ఏర్పా టు చేసి ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ గస్తీ నిర్వహించారు.
నెక్కొండ రూరల్ : మండలంలోని ఆయా గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా మొదటి రోజు ప్రారం భమయ్యాయి. రంగుల పూలతో అలంకరించిన బతుక మ్మలను ఆయా గ్రామాల గ్రామదేవతల వద్ద పెట్టి ఆటపా టలతో ఆడి పాడి సంబరాలు ప్రారంభించుకున్నారు. బతుక మ్మ వేడుకలకు విద్యుత్ లైట్లు, సౌండ్స్ ను గ్రామ పంచా యతీలు ఏర్పాటు చేశాయి. వేడుకల్లో సర్పంచులు యమునా రంజిత్ రెడ్డి, అనంతలక్ష్మి రవి, రజితసురేష్, తులసి వెంకన్న, శ్రీలత ప్రసాద్, పూర్ణ, సరిత తిరుమల్, స్వరూప, గీత, రాజమ్మ, విజయ, శైలజ, ఎంపిటిసిలు వినయ కుమారి శ్రీనివాసరావు, రమాదేవి, కరిష్మా, అలాగే వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.