Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడలతో ఉజ్వల భవిష్యత్
- తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-రాయపర్తి
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకులాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మం డల కేంద్రం శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలి కల గురుకుల ఆశ్రమ పాఠశాల /కళాశాలలో 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాజ్యోతిని వెలి గించి పోటీలను ప్రారం భించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలకు, ప్రభుత్వ పాఠ శాలలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత అత్యధిక సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొని యాడారు. గురుకులాల్లో చదువుతున్న విద్యా ర్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఐపీఎస్, ఐఏఎస్ ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని మంచి ఆశయా లక్ష్యాలను ఎంచుకొని సాధించాలి సూచించారు. తల్లిదండ్రుల ఆశలను, సీఎం కేసీఆర్ ఆశయాలను గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు నెరవేర్చాలని కోరారు. ఈ క్రీడా పోటీల్లో వరంగల్, హన్మకొండ, మహబూబాద్ జిల్లాలకు చెందిన 14 గురుకులాలకు చెందిన 1100 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. విద్యార్థుల నత్యాలు, క్రీడాకారుల మార్చి ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరి సింగ్, ఆర్సీవో విద్యారాణి, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ప్రిన్సిపాల్ ఉమ మహేశ్వర్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ సురేందర్ రావు, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీలు బిల్లా రాధిక సుభాష్ రెడ్డి, ఐత రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.