Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ
నవతెలంగాణ-డోర్నకల్
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకష్ణ అన్నారు. ఆదివారం మండల పరిధి ముల్కలపల్లి ప్రాథమిక పాఠశాలలో యూటీఎఫ్ మండల మహా సభ మండల అధ్యక్షుడు కాసం మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు దసరా సెలవుల్లోపు పూర్తి చేయాలని అన్నారు. లేదంటే ఆందోళన కర్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు కోసం దేశవ్యాప్తంగా ఎస్టీ ఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే యాకూబ్, నామ వెంకటేశ్వర్లు, వివేక్, మండల అధ్యక్షులు కసు మారే డ్డి,కార్యదర్శి బుచ్చయ్య, అబ్దుల్ అజీజ్, దేవేందర్, రాజ్యలక్ష్మి, అమనా, వెంకటప్పయ్య, సత్యనారాయణ, రాములు, సీతారాములు పాల్గొన్నారు.