Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధిపత్య పోరుతో పోలీసు స్టేషన్కు చేరిన పంచాయతీ
- పర్యవేక్షణ కరువుతో గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ
నవతెలంగాణ-గార్ల
వాళ్లు ఉపాధ్యాయులు, సమాజానికి, విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు.విద్యార్థుల బంగారు భవిష్యత్తు ను తరగతి గదులలో తీర్చి దిద్దాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. విద్యార్థులను ప్రయోజ కుడుగా తయారు చేయడంలో వారి పాత్ర వెలకట్టలేనిది. ఒక విద్యార్థులే కాదు, సమాజంలో ఇతరులు కూడా ఉపాధ్యాయులను' సార్ ' అంటూ గౌరవంగా పిలుస్తూ వారి పట్ల గౌరవాన్ని వ్యక్తపరుస్తుంటారు.ఇంతటి ప్రాము ఖ్యతను కలిగిన ఉపాధ్యాయులు కొందరు ఉపాధ్యా యులమనే బాధ్యతలు మరిచి సమాజంలో చులకన అవుతున్నారని మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు మండలంలో గత నెల రోజులపాటు వరుసగా జరుగుతున్న పలు సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.మండలంలోని చిన్న కిష్టాపురం పంచాయతీ సర్వాన్ తండాలో పాఠశాలలో ఉపాధ్యా యుడు సమయ పాలన పాటించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తూ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.అంతకు ముందు గుంపెళ్ళగూడెం పాఠశాలలో విధులు నిర్వహించిన ఓ ఉపాధ్యాయురాలు ముల్కనూరు క్లస్టర్ హెచ్ యం పై వేధింపుల అరోపణలు చేశారు.ఇదే మండలంలో సీతంపేట పరిధిలోని అంకన్న గూడెం ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ఓ ఉపాధ్యాయ సంఘం లో కీలక భాధ్యతలలో ఉండి కూడా ఇదే మండలంలో ఓ గ్రామం లోని ప్రాధమికోన్నత పాఠశాలలో టిచర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలును ఖమ్మం వెళ్లేందుకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి అత్యాచారం కు ఓడి గట్టగా సదరు ఉపాధ్యాయుడు ను విద్యా శాఖ అధికారులు సస్పెండ్ చేసిన సంగతి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మర్రిగూడెం పంచాయతీలో ఓ తండాలో పాఠశాలలకు ఉపాధ్యాయుడు రాకపోవడంతో స్యయంగా ఎంపిపి శివాజీ విద్యార్థుల కు పాఠ్యాంశాలు బోధించి జిల్లా అధికారుల దష్టి కి తీసుకువెళ్ళిన సంగతి విదితమే.
సీతంపేటలో తాజా ఘటన చర్చంశనియం
ఇది ఇలా ఉండగా సీతంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు గా పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ టిచర్ కు మరియు ఇదే పాఠశాలలో ప్రధానో పాధ్యాయుడిగా పని చేస్తున్న మరో ఉపాధ్యా యుడికి మధ్య అధిపత్య పోరు నడుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత మూడు నెలలు గా గణిత ఉపాధ్యాయుడు పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఒకరు, విద్యార్థులు, తోటి ఉపాధ్యాయుల ముందు హేళన చేసి మాట్లాడుతున్నారని మరొకరు ఆరోపణలు చేసుకుంటుండటంతో పాఠశాలలో ఘర్షణ వాతావరణం నెలకొందని స్థానికులు అరోపిస్తున్నారు.ఈ విషయం చిలికి, చిలికి గాలివానగా మారి వ్యక్తి గత దూషణల వరకు వెళ్లడంతో పాఠశాల ప్రధానోపాధ్యా యులు స్దానిక పోలీసు స్టేషనులో పిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపడుతున్నట్లు స్దానికుల ద్వారా తెలిసింది.ఈ ఘటన ఒక్కసారిగా సీతంపేట గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులలో చర్చంశనియంగా మారింది. ఇరువురు ఉపాధ్యాయుల మధ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పని చేసే విషయంలో పోటి పడ్డారని ఇది వ్యక్తి గత దూషణ లు చివరకు పంచాయతీ పోలీసు స్టేషను, జిల్లా విద్య శాఖ అధికారుల వరకు వెళ్లడం మండలంలో చర్చంశనియంగా మారింది.విధుల పట్ల క్రమశిక్షణ రాహిత్య ప్రవర్తన కారణంగా గణిత ఉపా ధ్యాయుడు జి కృష్ణ ను విధుల నుండి సస్పెన్షన్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం తల్లిదండ్రులు విద్యార్థుల ను పాఠశాల లకు పంపి స్తుండగా కొందరు ఉపాధ్యాయుల భాద్యతరహితమైన ప్రవర్తన, వరుస ఘటనలతో విద్యార్థుల భవిష్యత్తు పై తల్లిదండ్రులకు నీలి నీడలు కమ్ము కున్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. తక్షణమే సంబంధితశాఖ జిల్లా, మండల అధికారులు ప్రభుత్వ పాఠశాలల పై పూర్తి స్దాయి దష్టి సారించి విద్యా వ్యవస్థను కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్త లు,విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.