Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంతిపూల తోటే బతుకమ్మలు కిలో 150 నుండి 200
నవతెలంగాణ-పాలకుర్తి
తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణలోని ప్రతి పల్లెలో మహిళలు ఆడుకునే పూల (బతుకమ్మ) పండుగకు పువ్వులు కరువయ్యాయి. మహిళలు బతుకమ్మను పేర్చేందుకు కావలసిన పూలు తంగేడు, గునుగు, చామంతి, ముత్యాల పూలు, కట్ల పూలు, రుద్రాక్ష, బంతి, గులాబీ, గుమ్మడి పూలను బతుకమ్మకు ఉపయోగిస్తారు. ప్రకతి వైపరీత్యాల వల్ల తంగేడు పువ్వు, విషపూరిత క్రిమిసంహారక మందుల వల్ల గునుగు పూలు మచ్చుకు కానరాకపోవడంతో పూల పండుగకు పువ్వుల కరువు ఏర్పడింది. బతుకమ్మ పండుగ సందర్భంగా పూలనే మహిళలు ఆరాధిస్తూ బతుకమ్మను పేర్చి చెరువు మైదానం కు చేరుకుంటారు. బతుకమ్మను పేర్చేందుకు ప్రధానంగా కావలసిన తంగేడు, గునుగు పూలు లేకపోవడంతో బంతిపూలకు గిరాకీ పెరిగింది. ధరలు ఆకాశాన్నంటాయి. కిలో బంతి 150 నుండి 200 పలికింది. ప్రకతి పరంగా పూసిన పూలతో బతుకమ్మను తయారు చేయాల్సిన మహిళలు బంతిపూలను కొనుగోలు చేసి బతుకమ్మలు పేర్చడం పట్ల మహిళలు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. బంతిపూలతోనే మహిళలు బతుకమ్మలను పేర్చుకున్నారు.