Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్తూపం వద్ద నివాళులర్పించిన ఐలమ్మ వారసులు
- ఎంపీడీవో, టీఆర్ఎస్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు
నవతెలంగాణ-పాలకుర్తి
భూమికోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల)ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలనను సాగిస్తూ బహు జనుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అన్నారు. తెలంగాణ రైకంగా సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయడంతో ఐలమ్మ 127 వ జయంతిని పురస్కరించు కొని సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యా లయంలో, టీఆర్ఎస్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రప టానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలోని ఐలమ్మ స్తూపం వద్ద ఐలమ్మ వారసులు నివాళులర్పించారు. ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పాలకుర్తి ప్రాంతానికి గర్వకారణం అన్నారు. పోరాటాల గడ్డకు సీఎం కేసీఆర్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషితో గుర్తింపునివ్వడం భావితరాలకు స్ఫూర్తిదా యకమన్నారు. బహుజన పోరాట యోధులను ప్రభుత్వం గుర్తింపునుస్తుందని, పాలకుర్తిలో ఏర్పాటు చేసిన మార్కెట్ కు ఐలమ్మ పేరు పెట్టారని గుర్తు చేశారు. బహుజనులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వనపర్తి అశోక్ కుమార్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్, జెడ్పిటిసి పుస్కూరి శ్రీనివాసరావు, డిప్యూటీ తహసిల్దార్ భాషెట్టి హరిప్రసాద్, పాలకుర్తి సొసైటీ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, ఎంపీటీసీ ఎడవల్లి పురుషోత్తం, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ ముస్కు రాంబాబు, ఐలమ్మ వారసులు చిట్యాల యాకయ్య, చిట్యాల సంధ్యారాణి, చిట్యాల సంపత్, చిట్యాల లక్ష్మి, మామిండ్ల రమేష్ రాజా, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పాము శ్రీనివాస్, లావుడియా మల్లునాయక్, సర్పంచ్ ధరావత్ బాలు నాయక్, ధరావత్ యాకుబ్ నాయక్, ఎండి.అబ్బా సాలి, కమ్మగాని వెంకన్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
నవతెలంగాణ-మరిపెడ
తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని మరిపెడ మున్సిపాలిటీ కార్యాలయం లో సోమవారం ఘనంగా నిర్వహించారు. మహబూ బాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. మున్సిపాలిటీ చైర్మన్ సింధూర కుమారి రవినాయక్, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్స్ కో ఆప్షన్ మెంబెర్స్, మచ్చర్ల స్రవంతి భద్రయ్య పాల్గొన్నారు
ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి
తొర్రూరు : తెలంగాణ వీరవారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని జడ్పిటిసి, జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, మున్సిపల్ చైర్మన్ మంగళపెల్లి రామచంద్రయ్య, రాష్ట్ర రూరల్ డెవెలప్మెంట్ డైరెక్టర్ లింగాల వెంకటనారాయణ, మండల అభివద్ధి కమిటీ చైర్మన్ డా. పొనుగోటి సోమేశ్వర్ రావు, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగా సురేందర్ రెడ్డి తో కలిసి మాట్లాడారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం పటిమను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పార్టీ నాయకులు ధరావత్ జైసింగ్, రాయిశెట్టి వెంకన్న, తూర్పాటి రవి, మాంకాల మల్లేష్, పైండ్ల సోమన్న, పైండ్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం
స్టేషన్‌ఘన్‌పూర్ : తెలంగాణ ఉద్యమనారి, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ఉద్యమిం చాలని రజక వత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి మైలారపు వెంకటేశ్వర్లు, మదర్ పిలుపునిచ్చారు. నియోజక వర్గ కేంద్రంలో సోమవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తిని నేటి యువకులు ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజక వర్గ కేంద్రంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఎంపీటీసీ నర్సింహులు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చింత జగదీష్, టిఆర్ఎస్వి నియోజకవర్గ ఇన్చార్జి లకావత్ చిరంజీవి, యాదగిరి, యాకయ్య భారతమ్మ, రాణి, సంపత్, మంజుల, సంఘం మండల అధ్యక్షుడు అంజయ్య, బిక్షపతి, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘనపురం : మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్ల ఉపేందర్ రెడ్డి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ జయశ్రీ ,రజక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో డికోండ రాజు మండల అధ్యక్షులు బస్వాగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నియోజకవర్గం వర్క్స్ కమిటీ చైర్మన్ బొల్లంపల్లి నాగేందర్, మాజీ జెడ్పీటీసీ గంగసాని గంగసాని రంజిత్ రెడ్డి, దిశ కమిటీ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, పీఏసీఎస్ చైర్మెన్ మాల్గ శ్రీశైలం, నవాబుపేట ఎంపీటీసీ తీగల సిద్దు గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేశం,లింగాల ఘనపురం గ్రామ శాఖ అధ్యక్షులు కెమిడి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : చాకలి ఐలమ్మ 127 వ జయంతిని ఘనంగా నిర్వహించినట్లు రజక సంఘం మండల అధ్యక్షుడు వరిపల్లి ఉప్పలయ్య తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆయన మాట్లాడారు. వార్డు సభ్యుడు వారిపల్లి పూర్ణచందర్ రత్నపురి యాకయ్య, సట్ల యాకయ్య, బండి యాకయ్య వీరభద్రం, లింగయ్య, శ్రీను, వెంకటేష్ పాల్గొన్నారు.
దేవరుప్పుల : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ఐలమ్మ చిత్రపటానికి ఎంపీపీ బస్వ సావిత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఎంపీడీఓ తాటి సురేష్,వైస్ ఎంపిపి కత్తుల విజయకుమార్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తోటకూరి కిష్టయ్య, మండల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర : అగ్ని కణం చాకలి ఐలమ్మ విప్లవ మూర్తి అని పెద్దవంగర సర్పంచ్ వెనుకదాసుల లక్ష్మి రామచంద్రయ్య శర్మ, ఎంపీటీసీ ఏదునూరి శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల రజక సంఘం అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాళలేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు కషి చేస్తామని అన్నారు. సింగిల్ విండో డైరెక్టర్ అనపురం రవి, ఉపసర్పంచ్ శ్రీరాం పురుషోత్తం, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజరు, ఏదునూరి యాకయ్య, వార్డు సభ్యులు కోణం రమేష్, అనపురం రాణి, ముత్యాల భవాని, పాల్గొన్నారు.
నర్మెట్ట : తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన చాకలి ఐలమ్మ జయంతిని మచ్చు పహాడ్ సర్పంచ్ రమినీ శివరాజు ఆధ్వర్యంలో సోమవారం నర్మెట్ట మండల కేంద్రంతో పాటు మచ్చు పహాడ్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఉపసర్పంచ్ కొంపెల్లి రాజు, వార్డు సభ్యులు వేల్పుల రాజు, పిఎస్సిఎస్సి డైరెక్టర్ బానోతు రాములు, మామిడాల వెంకటయ్య, టీఆర్ఎస్ మండల సంయుక్త కార్యదర్శి గుండేటి రాజశేఖర్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొంపెల్లి అంబేద్కర్, సర్దార్ పాపన్న గౌడ సంఘం అధ్యక్షులు గుండేటి రామచందర్, బీఎస్పీ మండల ఇన్చార్జి ప్రశాంత్, ఎస్ఎంసి చైర్మన్ బైరగోని రాజు, రజక సంఘం జిల్లా నాయకులు బుశెట్టి శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు.
తరిగొప్పుల : తెలంగాణ సాయుధ పోరాటంలో ధీరవనిత చాకలి ఐలమ్మ పోరాట పటిమ నేటి సమాజానికి స్పూర్తిదాయకంగా నిలుస్తుందని సర్పంచ్ అమీర్ శెట్టి వీరేందర్ అన్నారు. సోమవారం మండలంలోని అక్కరాజుపల్లి పంచాయతీ పరిధిలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో విప్లవాగ్నిగా నిలిచి నిజం నవాబు గుండెల్లో వణుకు పుట్టించిదన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రజకుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యదర్శి అమరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు రాజు, రమేష్, యాదగిరి, ఎఫ్ ఏ ప్రసాద్, కరోబార్ అక్తర్,సిబ్బంది పాల్గొన్నారు.
కొడకండ్ల : భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నైజాం ధోరణి ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని మండల పరిషత్ కార్యాలయంలో ఈజీఎస్ డైరెక్టర్ యాకయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మధుసూదన్, రామవరం గ్రామంలో సర్పంచ్ మందుల శిరీష ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. మండల అధ్యక్షుడు రామోజీ, ఎంపీడీవో సురేంద్రనాయక్ పాల్గొన్నారు.
మహబూబాబాద్ : చాకలి(చిట్యాల) ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తి ఆదర్శనీయమని మహబూబాబాద్ నలంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ డోలి సత్యనారాయణ అన్నారు. ఐలమ్మ జయంతిని సోమవారం మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో నలంద డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, కళాశాల ప్రిన్సిపాల్ వై కృష్ణప్రసాద్, అధ్యాపకులు శంకర్, తిలక్, ఉప్పలయ్య, కృష్ణారావు, రమేష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ఐలమ్మ
నరసింహులపేట : మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత చాకలి ఐలమ్మేనని పడమటి గూడెం గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ యాదలక్ష్మి వెంకన్న అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పడమటి గూడెం గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లా డారు. ఉపసర్పంచ్ నరసమ్మ, వార్డు మెంబర్స్ ఎస్కే అమీనా, అంగన్వాడి ఉపాధ్యాయురాలు శోభ, ఏకలక్ష్మి విమల, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా ఐలమ్మ జయంతి
జఫర్గడ్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ జయంతిని సోమవారం మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ నర్సింగ రావు ఎంపీటీసీ జ్యోతి రజిత యాకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్డ్మెంబర్లు సుధాకర్, శివరాజ్, ఎల్లయ్య, ముజిపు, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.