Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న
నవతెలంగాణ-నల్లబెల్లి
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి కేసీఆర్ రాష్ట్రంలోని ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలను అందజే స్తున్నట్లు జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అన్నారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నానబోయిన రాజారాం అధ్యక్షతన నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడపడుచులకు చీరలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చీరలను మేము సైతం కట్టుకొని బతుకమ్మ ఆడుతున్నా మన్నారు. నల్లబెల్లి జాతీయ రహదారి నుండి మండల కేంద్రంలోకి ఏర్పాటు చేసే రోడ్డు వెడల్పు పనులను త్వరలో కొనసాగిస్తామని, క్రాస్ నుండి మండల కేంద్రంలోకి సీసీ రోడ్డును ఏర్పాటు చేసే విధంగా పై అధికారులతో మాట్లాడ తా మని తెలిపారు. నల్లబెల్లిలోకి రావడానికి క్రాస్ వద్ద తోరణాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు కోరగా చేయిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గొడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, తాసిల్దార్ దూలం మంజుల, స్థానిక ఎంపీటీసీ జన్ను జయరావు, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గోనెల పద్మ నరహరి, పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ఆడపడుచులు, తదితరులు పాల్గొన్నారు. మం డలంలోని నారక్కపేటలో జడ్పిటిసి నిధుల ద్వారా మంజూరైన రూ.22 లక్షల తో మండలంలోని 15 గ్రామాల్లో సోలార్ లైట్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పెద్ది స్వప్న పాల్గొని ఆడప డుచులకు చీరలను అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ వక్కల మల్లక్క, ఎంపీటీసీ ఓదెల విజయలక్ష్మి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామపంచాయతీ కార్యదర్శి, పాల్గొన్నారు
పర్వతగిరి : మండలంలోని కొంకపాక జెడ్పీఎస్‌ఎస్‌లో సోమవారం సర్పంచ్ వర్కాల రమేష్ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి కరిమిళ్ళ మోహన్ రావు, వార్డు సభ్యులు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి : మన సంస్కతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని కాటాపూర్ సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ అన్నారు. సోమవారం మండలంలోని కాటాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి పేదింటి ఆడబిడ్డ ఆనందంతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని బట్టలు పంపిణీ చేశారని అన్నారు. కార్యక్రమంలో కాటాపూర్ పంచాయతీ కార్యదర్శి కోరం భాగ్యరాణి, ఎంపీటీసీ జయమ్మ, ఉప సర్పంచ్ మేడిశెట్టి పుష్ప, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.