Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తహసిల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏ లు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 64వ రోజు కు చేరుకుంది. కార్యక్ర మంలో విఆర్ఏ లు శంకర్, రమేష్, రాజు, కొమురయ్య, రాధిక, సునిత, సుమతి తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : వీఆర్ఏల నిర్వదిక సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని శివాలయం నుండి కొమ్మాల నరసింహస్వామి దేవాలయం వరకు మహా పాదయాత్ర నిర్వహించి నిరసన వ్వక్తం చేశారు. పాదయాత్ర లో వరంగల్ జిల్లా ప్రచార కార్యదర్శి బాషబోయిన ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ కర్ణకంటి రాజేష్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు శీలం రాజు డివిజన్ కో చైర్మన్ రవి. నెక్కొండ, చెన్నారావుపేట మండల చైర్మన్లు రమేష్ కో చైర్మన్ శివకోటి జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ వీఆర్ఏలు సునీల్, కృష్ణ ప్రసాద్ పాదయాత్రలో పాల్గొన్నారు.