Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతిశీల హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీరామ్ పుల్లయ్య
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది ఉన్న హమాలీ అండ్ మిల్ వర్కర్స్ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రగతిశీల హమాలి అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీరామ్ పుల్లయ్య కోరారు. సోమవారం స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సెప్టెంబర్ 28న రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వ హించాలని నిర్ణయించామని తెలిపారు. రెక్కలు ముక్కలు చేసుకొని చెమట చిందించి మూటలు మోస్తున్న హమాలీ కార్మికులకు బతుకు భరోసానిచ్చే చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమ య్యాయన్నారు. దేశంలో ఎగుమతులు, దిగుమతులు చేస్తూ ప్రజల అవస రాలు తీర్చుతూ, ప్రభుత్వాలకు, వ్యాపారస్తులకు కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చేది హామాలీ కార్మికులేనని అన్నారు. చాలీచాలని జీతాలతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రయోజనం చేకూర్చే పథకాలు ఏవి అమలు కాకపోవడం ప్రభుత్వాల ద్వంద వైఖరికి నిద ర్శనమన్నారు. హమాలీ వర్కర్స్ సమస్యల పరిష్కా రానికి ఇటీవల ఖమ్మం లో జరిగిన రాష్ట్ర మహాసభ లో తీర్మానించిన ప్రకారం ఈ నెల 28న అన్ని లేబర్ కార్యాలయాల ముందు ప్రదర్శనలు, ధర్నాలు, పికెటింగ్‌లు నిర్వహించాలని నిర్ణయించామని తెలి పారు. ఈనెల 28న తొర్రూరు లేబర్ ఆఫీస్ ఎదుట నిర్వహించే ధర్నా ను జయప్రదం చేయాలని పిలు పునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు బానోతు బాలు, మంగళపెళ్లి సాయిలు, రాజు, రవీందర్‌రెడ్డి, బిక్షపతి, వెంకన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.