Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేరు సంగం రాష్ట్ర నాయకులు కొత్తకొండ కరుణాకర్
నవతెలంగాణ-పాలకుర్తి
హక్కుల సాధన కోసం మేరు సంఘం ఐక్యంగా పోరాడాలని మేరు సంఘం రాష్ట్ర నాయకులు కొత్తకొండ కరుణాకర్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని మేరు సంఘం కార్యాలయంలో సోమ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర నాయకులు తాళ్ల సంపత్ తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. సమాజంలో మేరు కులస్థుల ప్రాముఖ్యత ఎంతో ఉందని, మేరు కులస్థులు ఐక్యంగా లేక పోవడంతో మేరు కుల సంఘాల నిర్మాణం, అభివృద్ధిలో వెనుకడుగు వేస్తున్నారన్నారు. ఐక్యతతో సంఘ అభివృ ద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. మండల మేరు సంఘం ఆధ్వర్యంలో 30 సంవత్సరాల క్రితం భవన నిర్మాణానికి భూమి కొనుగోలు చేసి భవన నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు. కుల సంఘాలలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకొని వాటి పై వచ్చే లాభాలను ఆర్థిక వనరులుగా మార్చుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేరు సంఘం కవులు, కళాకారుల సంఘం తరపున లక్ష రూపాయలు మండల మేరు సంఘానికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గూడూరు బాలాజీ, రాపర్తి సుధాకర్, మునగాల పిచ్చయ్య, కొండ శ్రీనివాస్, రాయబారపు అశోక్, సోమ అశోక్ బాబు, సత్యం, రవి, శేఖర్, రాములు, వాసు, వెంకటయ్య, మాశెట్టి లక్మినారాయణ, సోమ సోమరాములు తదితరులు పాల్గొన్నారు.