Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి
నవతెలంగాణ-బచ్చన్నపేట
రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసి లాభాలు ఆర్జించి బాగుపడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ధేశమని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పులిగిల్ల అంజయ్య సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటి ఆయన మాట్లాడారు. మొక్కలను మూడు సంవత్సరాలు సంరక్షిస్తే నాలుగో సంవ త్సరంలో రైతులకు రాబడి రావడం ప్రారంభమవుతుందన్నారు. ఎకరాకు లక్ష రూపాయల నుండి రెండు లక్షల వరకు ఆర్జించొచ్చన్నారు. జనగామ జిల్లాలోని ఆయిల్ ఫామ్ కంపెనీ మొదలు పెట్టేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, కేసిరెడ్డిపల్లి ఎంపీటీసీ కర్నల వేణుగోపాల్, పిఎసిఎస్ డైరెక్టర్ కానుగంటి చందు, నాయకులు కృష్ణంరాజు, ఎండీ అజీమ్, తదితరులు పాల్గొన్నారు.