Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ- స్టేషన్‌ఘన్‌పూర్
రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, అందరి బంధువుగా సీఎం కేసీఆర్ పాలన సాగుతుందని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ, ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను, జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డితో కలిసి, చిల్పూర్ మండలం నష్కల్, చిన్నపెండ్యాల, శ్రీపతి పల్లిలో గ్రామ సర్పంచులు మామిడాల లింగారెడ్డి, కేశిరెడ్డి ప్రత్యూషా మనోజ్ రెడ్డి, కర్ణకంటి స్వప్న అధ్యక్షతన అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ, బోనాల పండుగలతో, అంతటా తెలంగాణ సంస్కతిని చాటి చెప్పే విధంగా, జాగృతి ఏర్పాటుతో రాష్ట్ర ప్రజల్ని చైతన్య పరిచేందుకు ఎమ్మెల్సీ కవిత చరిత్ర సృష్టించిందని అన్నారు. మతాలకతీతంగా సమన్యాయం చేస్తూ, పండుగ కానుకగా, ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత దుస్తులు అందిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో రూ.570 కోట్లతో 2లక్షల 9వేల చీరల్ని దసరా కానుకగా ఇస్తున్నదని అన్నారు. నియోజక వర్గానికి కొత్తగా 15915 చీరలు వచ్చినట్లు చెప్పారు. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం రైతాంగానికి డోఖా లేకుండా, ఓపికుంటే మూడో పంట వేసుకునేందుకు సాగునీరు పుష్కలంగా ఉందన్నారు. భవిష్యత్తు లో నియోజకవర్గానికి కరువురాదన్నారు. అన్ని వర్గాలకు కేసీఆర్ మేలు చేస్తూ, దేశానికి ఆదర్శ పాలన చేస్తుంటే, పచ్చగానున్న తెలంగాణపై బీజేపోని కళ్ళు పడ్డాయని, మాయ మాటలు చెపుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కేసీఆర్ అందిస్తున్న పథకాలను రద్దు చేయాలనం టున్నారని, ప్రజలంతా గమనించి కేసీఆర్ దేశ రాజకీయ భవిష్యత్తుకు అండగా నిలవాలని కోరారు. తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర పాలకుల చేతిలో వెనుకబడ్డ ప్రాంతంగా మారిందని, 2001లో మొదలైన ఉద్యమంలో కేంద్రం మెడలు వంచి, స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు. అనంతరం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల నీటితో సాగునీరు, ఉచిత విద్యుత్ సమృద్ధిగా అందిస్తున్నామని, పంటలు సాగై, రైతులు సుభిక్షంగా ఉన్నారని జెడ్పీ చైర్మెన్ సంపత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొమ్మిశెట్టి సరితాబాలరాజు, మాజీ మండల అధ్యక్షుడు గుర్రపు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మార బోయిన ఎల్లమ్మ, ఉమాసమ్మయ్య, ఎల్లయ్య, కో ఆర్డినేటర్ రంగు రమేష్, డైరెక్టర్లు రంగు హరీష్, రాజన్ బాబు, శ్యాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.