Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీబ్ల్యూఓ నర్మద
నవతెలంగాణ-మహబూబాబాద్
వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను రూపొం దించిందని డీడబ్ల్యూఓ నర్మద అన్నారు. వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం మహబూబాబాద్ రైతు వేదికలో వయోవృద్ధులకు ఆటల పోటీలు మ్యూజికల్ చైర్, వాకింగ్ తదితరవి నిర్వహించారు. వయోవృద్ధుల అనారోగ్య సమస్యలపై డాక్టర్ సుధీర్ నాయక్ వివరించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి నర్మదా మాట్లాడుతూ.... వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను హింసించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, బాలల పరిరక్షణ అధికారి వీరన్న, గాయకుడు ప్రేమ్ కుమార్, వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, సభ్యులు , చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ వెంకటేష్, రమేష్, వినోద్‌కుమార్, ఉపేందర్ పాల్గొన్నారు.