Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
పర్యాటక అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని పాలకుర్తి, బొమ్మెర పర్యాటక అభివద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ బొమ్మెరలో రూ.14 లక్షలతో చేపట్టిన అక్షరాభ్యాసం హాలు, ఫలహారశాల, వాష్ రూమ్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. థియేటర్ వర్క్, కాంపౌండ్ వాల్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అనంతరం పాలకుర్తిలో రూ.19.50కోట్లతో చేపట్టిన కళ్యాణమండపం పనులను సమీక్షించారు. సోమనాథ స్మారక పనులు వేగవంతంగా చేపట్టాల న్నారు. అనంతరం వాల్మీకి ప్రాజెక్టుపై సమీక్షించారు. రూ.7కోట్లతో చేపట్టిన గోపురం స్థాయి వరకు అయిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కళ్యాణ మండపం పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి గోపాల్రావు, ఆర్అండ్బీ ఈ హుస్సేన్, డీఈ జీవన్, ఇరిగేషన్ ఈఈ ప్రవీణ్, ఆర్కియాలజీ కాంట్రాక్టర్లు నరసింహారెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.