Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
హక్కుల సాధన కోసం రైతు వ్యతిరేక వ్యవస్థపై పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ కీర్తించబడే స్థాయికి ఎదిగారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని సోమవారం స్థానిక ఐఎంఏ హాల్లో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్స వాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న దన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. రజకుల అభివృ ద్ధిలో భాగంగా రజకుల షాపులకు నిర్దేశించిన యూనిట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నదని అన్నారు. కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లలను ఆదుకుంటున్నదన్నారు. ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని సదుపాయాలు వసతులు కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కె శశాంక మాట్లాడుతూ ప్రస్తుత జనగామ జిల్లా మారుమూల ప్రాంతంలో జన్మించిన వీరనారి చాకలి ఐలమ్మ చేసిన రైతు వ్యతిరేక పోరాటాల ఫలితంగానే రైతు వ్యతిరేక వ్యవస్థ నుండి విముక్తి లభించిందని అన్నారు. ఐలమ్మ స్ఫూర్తిని ప్రస్తుత సమాజంలో కొనసాగించాలని తెలిపారు. అంతకు ముందు వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ్ణశాఖ అధికారి నరసిం హస్వామి, రజక సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ దుగ్గి గోపాల్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వయి రామ్ మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల నవీన్, కన్వీనర్ దుగ్గి చంద్రయ్య, గూడూరు రజక సంఘం అధ్యక్షులు సిహెచ్ వెంకన్న, మున్సిపల్ కౌన్సిలర్లు కె పద్మ, ఎన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
వీరత్వానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ
జనగామ కలెక్టరేట్ : సమాజంలో జరిగే అన్యాయాల పై విరుచుకుపడ్డ వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలను, ప్రజాస్వామిక పోరాటాన్ని నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ వారసులను పిలిపించి వారికి గుర్తింపు ఇచ్చారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డిఆర్డిఎ పిడి రామ్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్, ఇతర అధికారులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ
జెడ్పి చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి
జనగామ : ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని జిల్లా పరిషత్ చైర్మన్ , టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా స్థానిక జడ్పీ కార్యాలయం లో ఐలమ్మ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీర వనిత చాకలి ఐలమ్మ చేసిన త్యాగం మరువలేనిది అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులు మదార్, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.