Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్థి
రైతులు, పాలకవర్గం ఐక్యతతో పని చేస్తేనే బ్యాంకు అభివృద్ధి చెందుతుందని సొసైటీ చైర్మెన్ శ్రీపతి రవీందర్ గౌడ్ తెలిపారు. ఎల్కతుర్తి విశాల సహకార సంఘం 68వ మహాసభ సోమవారం నిర్వహించగా ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. 1957లో 100 మందితో ప్రారంభమైన సహకార సంఘం 4837 మందితో ప్రస్తుతం అబివృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు. గత పాలకవర్గం చేసిన తప్పిదాల వల్ల సుమారు రూ.2 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లిందని చెప్పారు. 2020లో తమ పాలకవర్గం ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.86 లక్షల రూపాయల డిపాజిట్లు, కోటి రూపాయల లాభాలను సంపాదించామని వివరనించారు. అలాగే ఎరువుల కొరత లేదన్నారు రైతులకు సకాలంలో రుణాలు ఇస్తున్నామని, అన్ని గ్రామాల్లో కొనుగోలు ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు వారం రోజుల్లోగా డబ్బులు అందజేస్తున్నామని గుర్తు చేశారు. వాటర్ ప్లాంట్ అబివృద్ధికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ చొరవతో, కేడీసీసీ చైర్మన్ కొండూరు రవీందర్రావు సహకరాంతో బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోందని చెప్పారు. సమావేశంలో వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు బూర్గుల రామారావు, సర్పంచ్ సామల జమున సురేష్‌రెడ్డి, ఎంపీటీసీ చెవుల కొమరయ్య, పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్, సమ్మయ్య, బరీదుల రాజిరెడ్డి, నాగిళ్ల కృష్ణమూర్తి శర్మ, పోచయ్య, ఐలయ్య, సూరయ్య, వెంకటరావు, బ్యాంకు సీఈఓ తిరుపతి, హింగే శివకుమార్, ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.