Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్
నవతెలంగాణ-చిట్యాల
రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు బలోపేతం కావాలని డీఏఓ విజయభాస్కర్ అన్నారు సోమవారం మండలంలోని జూకల్ గ్రామంలో రైతు వేదికలో ఎస్ఎఫ్ఏసి సహకారముతో ఏఎఫ్సీ ఇండియా అధ్వర్యంలో రౖతు ఉత్పత్తిదారుల కంపెనీ, ఏఈఓలు, ఏఓలు, బ్యాంకు అనుబంధ సంస్థలు, సీబీబీఓలకు ఈక్విటీ గ్రాంట్, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్స్ఫై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ విజయభాస్కర్ మాట్లాడారు. రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే ఈ రెండు స్కీంలు ఉపయోగపడతాయని తెలిపారు. శాఖా పరమైన సహకారం ఉంటుందని చెప్పారు. వ్యవసాయ విస్తరణల్లో భాగంగా ఏఓలు రైతు ఉత్పత్తిదారుల కంపెనీల సమావేశాలకు హాజరై వారికి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సలహాలు సూచనలు అందించాలని కోరారు. అనంతరం రైతు ఉత్పత్తిదారుల ప్రతినిధులు అనుభవాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమములో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ తిరుపతి, కేవీకే వెటర్నరీ అధికారి, జిల్లా వెటర్నరీ అధికారి సదానందం, ఫిషరీస్ అధికారి అవినాష్, ఏఎఫ్సీ అధికారి ప్రసన్న, రిసోర్స్‌పర్సన్ నాగబ్రహ్మచారి, అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ అధికారి శ్రీనివాసరాజు, ఏఓ నాలిక రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.