Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలకు చీరలు పంపిణీ
నవతెలంగాణ-ఐనవోలు
బతుకమ్మ పండుగను తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అభివర్ణించారు. మండలంలోని పున్నెల్, పంతిని, పెరుమాండ్లగూడెం, కక్కిరాలపల్లి, నందనం గ్రామాల్లో సోమవారం ఆయన మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్దిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే రూ.6 కోట్ల వ్యయంతో చేపట్టిన స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్స్, పల్లె ప్రకృతి వనాలు, గ్రామీణ క్రీడా మైదానాలు, సీసీ రోడ్లు, తదితర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. బతుకమ్మ పండుగ రోజున మహిళలు కొత్త బట్టలతో సంతోషంగా ఉండాలనే కాంక్షతో, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ మార్నెని రవీందర్రావు, జెడ్పీ వైస్ చైర్మెన్ గజ్జెల శ్రీరాములు, ఎంపీపీ మధుమతి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఉస్మాన్ అలీ, సర్పంచ్లు కత్తి దేవేందర్, ప్రేమ లత పూర్ణచందర్, పిడుగు రజిత, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని గోపాలపురం, కొత్తపేట, ఒడితల గ్రామాల్లో మహిళలకు ఎంపీపీ దావు వినోద, జెడ్పీటీసీ గొర్రె సాగర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో గోపాలపురం సర్పంచ్ దుప్పటి రజిత శ్రీనివాస్, ఎంపీటీసీ పిసారా సుశీల, కొత్తపేట సర్పంచ్ రవి, ఒడితల సర్పంచ్ సాంబలక్ష్మీ, పీఏసీఎస్ వైస్ చైర్మైన్ గణపతి, డైరక్టర్ రాజునాయక్, నాయకులు కుమార్, సురేష్, రఘు, అంకూస్, నగేశ్, శ్రీరామ్ నగేశ్, సతీష్, మొగిళి, ఉప సర్పంచ్ స్వరూప శంకర్, సత్యం, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.
మహాముత్తారం : మండలంలోని స్తంభంపల్లి (పీకే)లోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ మేడిపల్లి సాంబ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు సతీష్, డీలర్ జరుపుల రాజన్న, ఎఫ్ఏ సారయ్య, గ్రామ సెక్రటరీ అంబాల మొగిలి, అంగన్వాడీ టీచర్ రేణుక, ఆశ వర్కర్ కవిత, తదితరులు పాల్గొన్నారు.
నడికూడ : మండలంలోని కౌకొండలో సర్పంచ్ మేకల రమేష్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయగా ఉప సర్పంచ్ ముక్కెర సురేష్, ఎంపీటీసీ మేకల సతీష్, పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్, కారోబార్ శంకర్, తదితరులు పాల్గొన్నారు. అలాగే చర్లపల్లిలో సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేయగా వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంక్షేమమే సీఎం లక్ష్యం : ఎమ్మెల్యే రాజయ్య
వేలేరు : ప్రజాసంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య తెలిపారు. మండలంలోని మల్లికుదుర్ల గ్రామంలో సోమవారం బతుకమ్మ చీరలు, ఓల్డ్ పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మీ చెక్కులను స్థానిక సర్పంచ్ గోదల రాజిరెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేసి మాట్లాడారు. బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మహిళ సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరిత, ఎంపీటీసీ బాల్లె వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ గోవింద సురేశ్ తదితరులు పాల్గొన్నారు.