Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా వికలాంగుల, వయో వద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ముద్రించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయో వద్ధులను గౌరవిస్తూ మర్యాద ఇచ్చే గొప్ప సంస్కతి మనదని చెప్పారు. వారితో గౌరవంగా ఉంటూ, ప్రేమతో మసలుకోవాలని తెలిపారు. ప్రభుత్వం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు వద్ధుల కోసం వేడుకలు నిర్వహిస్తోందని చెప్పారు. ఈనెల 25, 26 తేదీల్లో వద్ధాశ్రమాలలో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 27న వయోవద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007, నియమావళి రూల్స్ 2011పై అవగాహన కార్యక్రమాలు, 28న సర్పంచ్లకు వద్ధుల హక్కులపై అవగాహన కల్పించడం, 29న అంగన్వాడీ కేంద్రాల్లో వద్ధులకు, చిన్నారులకు అనుబంధం పెంచేలా పేరెంట్స్ డే, 30న వద్ధుల హక్కులపై అవగాహన కల్పిస్తూ నడక కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు వివరించారు. వద్ధుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఆసరా పెన్షన్లు, మొబైల్ మెడికేర్ యూనిట్స్, ఫిజియోథెరపీ కేంద్రాలు, డే కేర్ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు ముఖ్యంగా మహిళల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వయోవద్దులకు పోషణ, సంక్షేమ చట్టం 2007, నియమావళి రూల్స్ 2011 అమలుచేయడంతో పాటు, వయో వద్ధులను నిర్లక్ష్యం చేస్తూ మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక వేధింపులకు గురి చేసిన పక్షంలో టోల్ ఫ్రీ నంబర్14567 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, విచారించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శామ్యూల్,వద్దులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.