Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర దంపతులు
- ఘనంగా దేవి శరన్న వరాత్రోత్సవాలు
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే గండ్ర దంపతులు ఆకాంక్షించారు. దేవి శరన్నవరాత్రోవాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మహా చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి నేతత్వంలో నియోజకవర్గ ప్రజల శ్రేయస్సును కోరతూ ప్రతీ ఏట వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సోమవారం మొదటి రోజు మహాచండీ హౌమం చేపట్టి బాల త్రిపుర సుందరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే గండ్ర దంపతులు పూజల్లో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు అందించారు. వేద పండితులు శ్యామ్, సందీప్, శ్రీధర్, సచిన్ మంత్రోచ్చరణల మద్య మహాపూజ కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు. కఠిన విపత్కర వేల నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు కలగవద్దని, గడిచిన రెండేళ్లలో హౌమం విజయవంతంగా నిర్వహించామన్నారు. రాబోయే తొమ్మిది రోజులు క్యాంపు కార్యాలయం లో అత్యంత భక్తిశద్రల నడుమ వేద పండితులతో అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుందన్నారు. నియోజకర్గ ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పూజా కార్యక్రమాలను తిలకించాలని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బుర్ర రమేష్, మున్సిపల్ చైర్మెన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, ఎంపీపీ మండల లావణ్య, జంగేడు పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్ యాదవ్, గణపురం పీఏసీఎస్ చైర్మెన్ పూర్ణచంద్రారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, జిల్లా నాయకులు కళైపు రఘుపతిరావు, మండల సాగర్‌రెడ్డి, సెగ్గం సిద్దు, గడ్డం కుమారెడ్డి, కౌన్సిలర్ ముంజాల రవిందర్ గౌడ్, సజనపు స్వామి, అనిల్, ఎడ్ల మౌనిక ,పానుగంటి హారిక, కోఆప్షన్ మెంబర్ బేతోజు వజ్రమణి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.