Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
సింగరేణి కాంటాక్ట్ కార్మికులపై నిర్బంధాన్ని నిలిపేయాలని, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9 నుండి జేఏసీ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిందని చెప్పారు. ఫిబ్రవరి 9న సింగరేణి అధికారులు లేబర్ అధికారుల సమక్షంలో యూనియన్ లీడర్లతో కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తామని అగ్రిమెంటు చేసి ఇప్పటి వరకు అమలు చేయలేదని చెప్పారు. 9 సార్లు లేబర్ అధికారులతో యూనియన్ల మధ్య సింగరేణి అధికారులతో చర్చలు జరిగినప్పటికీ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు దీని ద్వారా కడుపు కాలి,జీతాలు సరిపోక కనీస వేతనాల కోసం కాంట్రాక్ట్ కార్మికులందరూ బజార్నబడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ హైదరాబాద్ ఆర్ఎల్సీ ఆఫీసులో యూనియన్ లీడర్లతో సింగరేణి యాజమాన్యం లేబర్ అధికారుల సమక్షంలో చర్చలు విఫలం అయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల కోరికలు న్యాయబద్ధమైనవి మున్సిపాలిటీ ఏరియాల్లో పోటీగా కార్మికులను పెట్టి కాంట్రాక్ట్ కార్మికులకు మున్సిపాలిటీ కార్మికుల మధ్య తగాదా పెట్టొద్దనికోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్లను కార్మికులకు అలాట్ చేయాలని, సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, చట్టబద్ధమైన సెలవులు కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఇవ్వాలని, ఉత్పత్తి, దీపావళి బోనస్, టస్పషల్ ఇన్స్టెంట్లను కాంట్రాక్ట్ కార్మికులకు డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఎలిశెట్టి రాజయ్య, రమేష్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.