Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాటి పోరాటమే 'స్వరాష్ట్ర' ఉద్యమానికి స్ఫూర్తి
- రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ఊరూరా జయంతి వేడుకలు
నవతెలంగాణ-హనుమకొండ
చాకలి ఐలమ్మను స్ఫూర్తిప్రదాతగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటే స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని ఆయన తెలిపారు. హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల్లో ఊరూరా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. హనుమకొండలోని న్యూశాయంపేట సర్కిల్లోని ఐలమ్మ విగ్రహానికి మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, తదితర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ లాంటి తెలంగాణ సాయుధ పోరాట యోధులకు సరైన గుర్తింపు ఇస్తోందని తెలిపారు. ఐలమ్మ జయంతి, వర్ధంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో కుడా చైర్మెన్ సుందర్ రాజ్, వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అజీజ్ ఖాన్, బీసీ సంఘాల నాయకులు, రజక సంఘం ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ : సీపీఐ(ఎం) హనుమకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో బాలసముద్రంలో ఐలమ్మ చిత్రపటానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు, మండల కార్యదర్శి మంద సంపత్ పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు దూడపాక రాజేందర్, అలకుంట్ల యకయ్య, నోముల కిషోర్, ఎన్నాం వెంకటేశ్వర్లు, దుర్గా, రమ్య, రాణి, రాజు, కావ్యశ్రీ, సందీప్, తదితరులు పాల్గొన్నారు.
పరకాల : స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర మడికొండ శ్రీను పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ రేగూరి జయపాల్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బొచ్చు వినరు, ఏఎంసీ చైర్మెన్ సారంగపాణి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ : మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి బీజేపీ మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో ఓబీసీ మండల అధ్యక్షుడు సదానందం, బీజేవైఎం మండల అధ్యక్షుడు ప్రదీప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్, బూత్ అధ్యక్షుడు సాంబయ్య, సారయ్య, ప్రశాంత్, రవి, కైలాసపతి, తదితరులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : స్థానిక బస్టాండ్ కూడలిలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. రజక సంఘం మండల అధ్యక్షుడు పున్నం రవి మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం గ్రామ అధ్యక్షుడు తంగళ్లపల్లి రాజ్‌కుమార్, యూత్ అంచనగిరి, వెంకటరమణ, భువనగిరి స్వామి, బోనగిరి రాజు, తంగళ్లపల్లి భద్రయ్య, భువనగిరి సమ్మయ్య, బోనగిరి ఐలయ్య, భువనగిరి శ్రీను, భువనగిరి నాగరాజు, చీకటి లక్ష్మణ్, గూడెపు తిరుపతి, తీగలపూరి సమ్మయ్య, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు కడారి రాజు, సర్పంచ్ కొమ్మిడి నిరంజన్‌రెడ్డి, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.గొర్రె మహేందర్, రచ్చబండ కోఆర్డినేటర్ పాక రమేష్, గుడెల్లి లక్ష్మణ్, బీజేపీ, గొర్ల కాపరుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ ముష్కే వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి కోరే కార్తీక్, మన్తుర్తి శ్రీకాంత్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి శనిగరపు రాజ్‌కుమార్, ఆనందం, కామెర లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
హసన్‌పర్తి : మండల కేంద్రంలో ఆదర్శ రజక సహకార సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను నిర్వహించగా కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, ఆత్మ చైర్మెన్ కందుకూరి చంద్రమోహన్, డైరెక్టర్లు చకిలం రాజేశ్వరరావు, వీసం సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, జాక్ నాయకులు అనుమాండ్ల విద్యాసాగర్ హాజరై చాకలి ఐలమ్మ చితప్రటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించి ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, నాయకులు వల్లాల యాదగిరి, రజక సంఘం అధ్యక్షులు గోపరాజు ఉదరు కుమార్, ఎలుకరాజు సదానందం, గోపరాజు యాదగిరి, శ్రీనివాస్, మొగిలి, కనక స్వామి, సాంబమూర్తి, రమేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
గొప్ప పోరాట యోధురాలు : కలెక్టర్
భూపాలపల్లి : చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. కలెక్టరేట్లో ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలని కొనియాడారు. కార్యక్రమంలో జేసీ స్వర్ణలత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శైలజ, ఏఓ మహేష్ బాబు, రజక సంఘం నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలి : చైర్పర్సన్
చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలని మున్సిపల్ చైర్మన్ వెంకటరమణ సిద్దు అన్నారు. భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అవినాష్, కౌన్సిలర్లు ముంజాల రవీందర్ గౌడ్, జక్కం రవికుమార్, పానుగంటి హారిక శ్రీనివాస్, మెప్మా డీఎం రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
మహాదేవపూర్ : మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద రజక కుల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వమించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి సర్పంచ్ శ్రీపతి బాపు, పలువురు నాయకులు, కుల సంఘ పెద్దలు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ శ్రీపతి బాపు, పీఏసీఎస్ చైర్మెన్ చల్లా తిరుపతిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కులపెద్దలు చెన్నూరి చంద్రయ్య, వెంకటయ్య, రాజు, శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, నాయకులు ఆన్కరి ప్రకాష్, మెరుగు లక్ష్మణ్, కోట రాజబాపు, ఆకుల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
పలిమెల : మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి తహసీఆ్దర్ స్రవంతి, ఎంపీడీఓ ప్రకాష్‌రెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రేగొండ : మండల పరిషత్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్, మటిక సంతోష్, చల్లగురుగుల సుదర్శన్, కొమ్మురాజు కళ్యాణ్ భిక్షపతి, వైనాల నరేష్, చింతల అనిల్, బండి రవి, జూపాక నీలాంబరం, గంజి రజినీకాంత్, వంచనగిరి వీరేశం, కానుగంటి శ్రీనివాస్, గాజర్ల వెంకటేష్, పున్నం ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
మల్హర్రావు : మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.