Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం
- ఆర్ఎల్సీ చర్చలు అవసరమైతే సమ్మె ఉదతం
నవతెలంగాణ-కోల్బెల్ట్
సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా 18వ రోజు జేఏసీ నాయకుల పిలుపు మేరకు సోమవారం ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలను ముట్టడించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దేవీ నవరాత్రుల సందర్భంగా పూజలో ఉండగా ఎమ్మెల్యే పీఏకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కంపేటి రాజయ్య, కుడుదుల వెంకటేష్, కొండపాక సాంబయ్య మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియా తరహాలో వేతనాలివ్వాలని, దీపావళి బోనస్ చెల్లించాలని, సింగరేణి కార్మికుల వలె విద్యా, వైద్యసౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్ఎల్సీ ఎదుట నేడు జరిగే చర్చలు విఫలమైతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయ కులు మధునమ్మ, సుధాకర్, దెబ్బట లక్ష్మి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.