Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు
- సొసైటీలో తీరని రైతుల సమస్యలు
- ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన రైతులు
నవతెలంగాణ-చెన్నారావుపేట
గత సమావేశంలో అధికారుల దష్టికి తీసుకొచ్చిన సమస్యలను నేటికీ పరిష్కరించకపోవడంపై సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని రైతులు నిరసన తెలి పారు. మండల ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాల యంలో చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన 65వ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. సంఘానికి 9500 మంది సభ్యులు ఉండగా కేవలం 300 మందితో సభను ఏర్పాటు చేయడమేంటని మాజీ సోసైటీ వైస్ చైర్మన్ తొగర్రు చెన్నారెడ్డి, ఆధ్వర్యంలో రైతులు ప్లకా ర్డులతో సభను వాయిదా వేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చెన్నారెడ్డి మాట్లాడుతూ అభివద్ధి అనేది బిల్డింగ్‌లతో, పెట్రోల్ బంకులతో కాదు అని, ప్రతి సభ్యుడు సొసైటీ రుణాల ద్వారా లావాదేవీలు నిర్వహించడంతోనే అభివద్ధి చెందుతుందన్నారు.100 మందితో జరిగే మహిళ, పురుషుల సంఘాలు లాభాల బాటలో పయని స్తుంటే సొసై టీలో 9500 మంది సభ్యులు ఉన్న సంఘాన్ని రూ.కోటి 64 లక్షల నష్టం ఏ విధంగా వచ్చిందంటూ పాలకవర్గాన్ని ప్రశ్నించారు. ఈ నష్టాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. మహిళా రైతులు పట్టా పాస్‌బుక్‌లతో రుణాలు ఎప్పుడు చెల్లి స్తారం టూ చైర్మన్ ప్రశ్నించారు. చైర్మన్ రైతులకు సమా ధానం చెబుతూ రెండేళ్లుగా కరోనా కష్టకాలంలో రైతు లకు ఎలాం టి రుణాలు అందించలేదని దీంతో రైతులు చాలా ఇబ్బం దులు పడ్డారన్నారు. రైతులు చెల్లించే వడ్డీలు రూ.11 కోట్లు చెల్లించిందని 50 వేల రుణం కొంతమంది సభ్యులకు మా త్రమే వచ్చిందని, మిగతా సభ్యులకు తీర్మా నం చేసిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ఇక నుండి రైతులకు ఎరు వుల కొరత ఉండకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్య క్రమంలో సీఈవో రవి, జెడ్పిటిసి పత్తినాయక్, జెడ్పి కో ప్షన్ సభ్యుడు ఎండి రఫీ, ఎంపీపీ బాదావత్ విజేందర్, వైస్ ఎంపీపీ కంది కష్ణారెడ్డి, సర్పంచ్ కుండే మల్లయ్య, వైస్ చైర్మన్ వంశీ, డైరెక్టర్లు, పాల్గొన్నారు.