Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీడీఎస్ సీడీపీవో మల్లీశ్వరి
నవతెలంగాణ-తాడ్వాయి
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యమని తాడ్వాయి ఐసిడిఎస్ సీడీపీవో మల్లీశ్వరి అన్నారు. మండలంలోని లింగాల గ్రామపంచాయతీ పరిధి లోని లవ్వాల ఆదివాసి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో కేర్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం జాతీయ పోషణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపివో, కేర్ ఇండియా సిఆర్పి కళ్యాణ్ మాట్లాడుతూ గర్భి ణీ నుంచి డెలివరీ అయ్యే బాలింతవరకు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని అన్నారు. పిల్లలకు పూర్తి స్థాయిలో టీకాలు వేయించుకోవాలన్నారు. చిన్నారులు ఆరో గ్యంగా ఎదగాలంటే సంపూర్ణ పౌష్టికాహారం తీసుకోవాలని, దీనిపై తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి అన్నారు. సెప్టెంబర్ మాసం అంతా ప్రత్యేక కార్యచరణతో అంగన్వాడి సెంటర్ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గర్భిణీలకు , బాలింతలకు క్విజ్ పోటీ నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ మంజుల, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ రూరల్ : గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో ఆరోగ్య సమ స్యలు దూరం అని రెడ్లవాడ సర్పంచ్ రావుల శ్రీలత ప్రసాద్ అన్నారు. మండలంలోని రెడ్లవాడ సెక్టార్ పరిధిలో సోమ వారం నిర్వహించిన పోషణ అభియాన్- పోషన్ మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు కావలసిన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుందని ఈ అవకాశాన్ని మహిళలు, చిన్నారులు సద్వినియోగం చేసు కోవాలని కోరారు. సెక్టార్ సూపర్వైజర్ శ్యామలాదేవి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో లబ్ధిదారులకు అంది స్తున్న సేవలను, పంపిన వివరాలను వివరించారు. కార్యక్ర మంలో గర్భణీలు, బాలింతలు, తల్లులు, బాలికలు, సెక్టార్ పరిధిలోని టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : మండలంలోని పాపయ్యపేట, ధర్మ తండా అంగన్వాడీ కేంద్రాల్లో సూపర్వైజర్ మంజుల ఆధ్వర్యంలో పోషక వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నప్రాసన చేసి గర్భిణీలకు సీమంతం నిర్వహిం చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంజుల మాట్లా డుతూ తల్లులు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి భోజనం చేయాలని, 6 నెలలు పూర్తయిన పిల్లలకు అదనపు ఆహారం అందించా లన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సుజాత, సుగుణ, పుష్పలత, ఇందిర, స్వర్ణ పాల్గొన్నారు.