Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్, ములుగు కలెక్టర్లు గోపి, కృష్ణ ఆదిత్య
- బల్దియా కమిషనర్ ప్రావీణ్య, ఐటీడీఏ పీవో అంకిత్
నవతెలంగాణ-వరంగల్
ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజ ావాణి కార్యక్రమానికి ఆయన హాజరై వివిధ సమస్యలపై లబ్ధిదా రుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సోమవారం ప్రజావాణిలో 54 దరఖాస్తులు స్వీకరించగా రెవెన్యూ విభాగానికి 34 దరఖా స్తులు, జి డబ్ల్యూఎంసి -2, ఎంజీఎం 1, గిరిజన సంక్షేమ శాఖ 1, ఎడిమైన్స్-01 సి ఎస్ సి-01, బి సి డి ఓ-01,డి ఎం హెచ్ ఓ- 1, ఎస్ సి.డి ఓ-01, ఎడ్యుకేషన్ 2, పంచాయతీ రాజ్ 1, మీ సేవ 1, మొత్తం 54 దరఖాస్తులు సంబంధించిన సమాచారాన్ని సంబం ధిత అధికారులకు పంపించి సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
బల్దియాలో ప్రజావాణికి వినతుల వెల్లువ
వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రావీ ణ్య ప్రజల నుండి వినతులు స్వీకరించినారు. ఇంజనీరింగ్ విభా గం12, మంచినీటి సరఫరా విభాగం 8, టౌన్ ప్లానింగ్ విభాగుం 30, పన్నుల విభాగం 5, ప్రజారోగ్య విభాగం 3, ఉద్యానవన విభా గం- 2 వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కమిష నర్ రవీందర్, ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, సి హెచ్ ఓ శ్రీనివాస రావు, సిటీ ప్లానర్ వెంకన్న, సెక్రటరీ విజయ లక్ష్మి, బయలజిస్ట్ మాధ వరెడ్డి, హెచ్.ఓ.ప్రిసిల్లా, ఎం.హెచ్.ఓ.డాక్టర్ రాజేష్, పాల్గొన్నారు.
ములుగు : కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం జిల్లా కలెక్టర్ క్రిష్ణ అదిత్య ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన దరఖాస్తుదారులు సమర్పించిన అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖాధికారులకు పంపుతూ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో 17 దరఖాస్తులు రాగా, రెవెన్యూ కు సంబం ధించి 8, ఇతర శాఖలకు సంబంధించినవి 9 దరఖాస్తులు వచ్చా యి. వెంకటాపూర్ మండలంలోని పాపయ్యపల్లికి బిడ్జి నిర్మాణం చేయాలని గత మూడేళ్లుగా ప్రతి వర్షాకాలం, కురిసిన భారీ వర్షాల కు గ్రామ చుట్టూ నీరు చేరి కనీస అవసరాలకు బయటికి వెళ్లలేక సరుకులు తెచ్చుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా రన్నారు. వెంకటాపూర్ మండలంలోని నారాయణగిరిపల్లె గ్రామ ప్రజలు తాము పూరి గుడిసెల్లో నివసిస్తున్నామనీ, ఇటీవల కురు స్తున్న భారీ వర్షాలకు సరుకులన్నీ తడుస్తూ ఇబ్బందులకు గురవుతున్నామని విషపురుగుల బారిన పడుతున్నామని, డబల్ బెడ్ రూములు మంజూరు చేయాలని కలెక్టర్ ను దరఖాస్తు చేసు కున్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ రమాదేవి, సీఈవో ప్రసన్న రాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, డి పి ఓ వెంకయ్య, డిఈఓ పాణిని, డి డబ్ల్యూ ప్రేమలత , డీఏవో హైదర్, షెడ్యూల్డు కులా సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
ఏటూరు నాగారంటౌన్ : గతంలో జరిగిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల నుండి స్వీకరించిన వినతులపై అధికారులు వివరణ ఇవ్వాలని ఐటీడీఏ పీఓ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన గిరిజన దర్బార్‌కు ఆయన వినతులను స్వీకరించారు. గత వారం ఇచ్చిన వినతులపై శాఖల వారీగా పీవో అధికారులను ప్రశ్నించారు. వచ్చిన వినతులను వెంటనే వాటికి పరిష్కారం చూపాలని, సమస్యాత్మకంగా ఉన్న వినతులను నా దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం ఆయా గ్రామాల నుండి 21 వినతులు రాగా పిఓ వాటిని స్వీకరించారు. కార్యక్ర మంలో ఏపీవో వసంతరావు, డిప్యూటీ డైరెక్టర్, పోచం, ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ హేమలత, పి హెచ్ ఓ రమణ, ఎస్ ఓ. రాజ్ కుమా ర్, ఆర్ సి ఓ, ఏ వీ రాజలక్ష్మి, జి సి సి డి యం ప్రతాప్ రెడ్డి, ప్రాజెక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, లక్ష్మీ ప్రసన్న, హార్టికల్చర్ ఆఫీసర్ భారతి, ఐ టి డి ఎ మేనేజర్ శ్రీనివాస్ సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.