Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఐటియు జిల్లా కార్యదర్శి రామస్వామి
నవతెలంగాణ-వరంగల్
తెలంగాణ రాష్ట్రంలో షెడ్యుల్ ఎంప్లాయిమెంట్స్లో కార్మికులకు కనీస వేతనం పెంచాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి అన్నారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో బాగంగా వరగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, సమావేశ మందిరంలో సోమవారం భాగంగా వరంగల్ కలెక్టర్ బి.గోపికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లా డుతూ నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు విద్య, వైద్య, ఖర్చులు విపరీతంగా పెరిగడంతో చాలీచాలని వేతనా లతో కార్మికులు తీవ్ర బ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో 37 షెడ్యూలు ఎంప్లాయీస్ కు కనీస వేతనం యివ్వాలనీ చాలాసార్లు చెప్పినప్పటికీ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. తక్షణమే జీవోలు ఇవ్వాలని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈనెల 26న ధర్నా నిర్వహిస్తున్నామ న్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 నుండి 2016 సంవత్సరాల లో కనీస వేతనాల సలహా మం డలిని ప్రభుత్వం నియమించిందని, వేతనాల ప్రతిపాదనలో తీర్మానాల బోర్డు ప్రభుత్వంకు పంపిందనీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించకుండా పక్కకు పెట్టిందని అన్నారు. ఒక కోటి 20 లక్షల మందికి ప్రయోజనం కలిగే ఈ జీవోను సవరించకుండా కార్మికుల కడుపులో కొట్టి యాజమానుల బొజ్జలు నింపుకొనే విధానం మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం యాజమాన్య సంఘాలు కార్మిక సంఘాలను వేరు వేరుగా అభిప్రాయాలు స్వీకరించారు. అలాగే కనీస వేతన సలహా మండలి యాజమాన్యం కార్మిక సంఘాల సల హాలు తీసుకొని ప్రభుత్వానికి పంపిందని వాటి ఆధారంగా నైనా కనీస వేతనాల ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా కనిస వేతనాల సవరణలు జాప్యం చేయకుండా జీవోలను జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివిధ కార్మిక సంఘాల నాయకులు పుల్ల రమేష్, గంగుల దయాకర్, ఇనుముల శ్రీనివాస్, యాకుబ్ పాష తదితరులు పాల్గొన్నారు.