Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘ అధ్యక్షులు గుగులోతు రామస్వామి
నవతెలంగాణ-వరంగల్
ఓడిసిఎంఎస్ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సంఘం అధ్యక్షులు గుగులోతు రామస్వామి అన్నారు. వరం గల్ నక్కలగుట్ట ఓ హోటల్ లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, సంఘం అభివృద్ధికి భవిష్యత్ లో తీసుకుంటున్న పలు చర్య లు గురించి తెలిపారు. ప్రస్తుత పాలకవర్గం ఆధ్వ ర్యంలో నూతన భవన నిర్మాణం, సంఘ అస్తుల రక్షణ గురించి, చేస్తున్న వ్యాపారాల గురించి వివరించారు. అనం తరం ముఖ్య అతిధిగా జిల్లా సహకార అధికారి బి. సంజీవరెడ్డి హాజరై మాట్లాడుతూ సహకార సంఘాల పురోగతికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల రాష్ట్ర అధ్యక్షులు ఎ.జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షులు దేశిడి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్స్ గుండెబోయిన నాగయ్య, గండ్ర సత్యనారాయణ రెడ్డి, కేడల జనార్ధన్, వర్ధమాన్ జనార్ధన్, డిసిసిబి డైరెక్టర్స్ చెట్టుపల్లి మురళీధర్, యం.రమేశ్, డి.రమేశ్, వ్యాపార నిర్వహణాధికారి, జి.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.