Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - డోర్నకల్
డోర్నకల్ మండల పరిధి అందానాల పాడు, జోగ్యా తండా,గొల్ల చర్ల, రాముతండా, రావి గూడెం,అమ్మ పాలెం గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో శుక్రవారం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. సర్పంచ్లు అంగోత్ మోహన్, అంగొత్ సరోజ వెంకన్న, చే రెడ్డి సమ్మి రెడ్డి, భద్రు నాయక్, దారంసోత్ రంబాయి,వరలక్ష్మి,వైయస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు హరీష్, మాజీ ఎంపీపీ రమ్య శ్రీనివాస్, ఎంపీటీసీ నీల రమేష్, మెహన్ రావు,ఎస్టీ సెల్ నాయకులు లచ్చు, ఉపసర్పంచ్ శ్రీను పాల్గొన్నారు.
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
మండలంలోని వెలికట్ట గ్రామంలో సోమవారం బతు కమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ పోసాని పుష్పలీల ప్రారంభించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో గ్రామ అబివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. గ్రామ కార్యదర్శి రమేష్, ఉపసర్పంచ్ దీకొండ యాకన్న, వార్డు సభ్యులు దీకొండ రాధిక, ప్రతికంఠం దేవేందర్ రాజు, మడిపెద్ది పుష్పలీల, బందు శ్రావణి, నాయకులు బత్తుల యాకయ్య, ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు కొమ్ము సోమయ్య, డీలర్ నరేష్, పాల్గొన్నారు.
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని కాచినపల్లి గ్రామ పంచాయతీలో సోమవారం బతుకమ్మ చీరలు, నూతన పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. వార్డు నెంబర్ పరిషిక రాజు పాల్గొని మాట్లాడుతూ... పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలుస్తున్నదన్నారు.సర్పంచ్ ముడీగా వజ్జయ్య, ఉప సర్పంచ్ పాండురాజు, వార్డు నెంబర్లు పూనం లక్ష్మీ, వుక లక్ష్మి, రేషన్ డీలర్ ఇరుప పద్మ, తదితరులు పాల్గొన్నారు.